మెగాస్టార్ చిరంజీవికి, విక్టరీ వెంకటేశ్ కు మధ్య పోటీ అంటేనే విచిత్రంగా ఉంటుంది. వారిద్దరి మధ్య పోటీ ఏంటి అనీ జనం అనుకుంటారు. కానీ, వారిద్దరూ ఇప్పటి దాకా బాక్సాఫీస్ బరిలో 13 సార్లు పోటీ పడ్డారు. ఒకసారి చిరంజీవిది పైచేయి అయితే మరో సారి వెంకటేశ్ ది పైచేయి అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ముచ్చటగా 14వ సారి చిరంజీవి సినిమాతో వెంకటేశ్ చిత్రం పోటీకి సై అంటోంది. చిరంజీవి తాజా చిత్రం ఆచార్య ఈ ఏప్రిల్…
హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ట్యాక్సీ’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ ‘ట్యాక్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతు న్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని చెబుతున్న చిత్ర…
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్…
చాయ్ బిస్కెట్ నుంచి గత ఏడాది లాక్డౌన్‌లో విడుదలైన వెబ్ సిరీస్ ’30 వెడ్స్ 21′. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల రికార్డులను బ్రేక్ చేసి న్యూ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్ లాక్డౌన్‌లో అందరినీ అలరించింది. చైతన్య, అనన్య జోడికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ రెడీ అవుతోంది. అసమర్థుడు, మనోజ్ పీ సంయుక్తంగా రెండో…
ఫిబ్రవరి నెల తొలి శుక్రవారం (4వ తేదీ) థియేటర్లలో చిన్న చిత్రాలు సందడి చేయబోతున్నాయి. శుక్రవారం దగ్గరకు వస్తుంటే… వరుసగా సినిమాల విడుదల ప్రకటన జోరందుకుంటోంది. ఆదివారం నాటికి ఫిబ్రవరి 4న విడుదల కాబోతున్న చిత్రాల సంఖ్య ఏకంగా ఏడుగా తేలింది! విశాల్ ‘సామాన్యుడు’ సినిమాను తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో శుక్రవారం విడుదల చేస్తున్నాడు. అలానే శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ చిత్రమూ ఫిబ్రవరి 4న రిలీజ్ కాబోతోంది. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవి…
గద్దర్ పేరు వినగానే ఆయన ముందున్న ప్రజాగాయకుడు అన్న బిరుదు గుర్తుకు వస్తుంది. ప్రజల పక్షాన నిలచి, వారి కష్టాలను తన గళంలో నింపి ఊరూరా వాడవాడలా పల్లవించి, ప్రభుత్వాలను దారికి తీసుకు వచ్చిన కళాకారుడు గద్దర్. ఆయన పుట్టిన తేదీపై పలు అభిప్రాయాలు ఉన్నాయి. అయితే చాలామంది జనవరి 30వ తేదీన గద్దర్ పుట్టినరోజు అని చెబుతారు. ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. బ్రిటిష్ రాజ్యంలో తెల్లవారి పాలనను వ్యతిరేకిస్తూ…
సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రాలను తెరకెక్కించడంలో మేటి అనిపించుకున్నారు దర్శకులు, సంగీత దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన రూపొందించిన చిత్రాలు, వాటిలో స్వయంగా స్వరకల్పన చేసిన గీతాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. ఏది చేసినా, జనానికి వినోదం పంచాలన్నదే కృష్ణారెడ్డి లక్ష్యంగా సాగారు. మళయాళంలో అలరించిన సల్లాపం చిత్రం ఆధారంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎగిరే పావురమా చిత్రం వెలుగు చూసింది. శ్రీస్రవంతి మూవీస్, చంద్రకిరణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పి.ఉషారాణి నిర్మాతగా…
ఆనందం అంబరాన్ని అంటుతున్న సమయంలో హద్దులు ఆకాశాన్ని సైతం దాటుతూ ఉంటాయి. ఆ సమయంలో ఏ మాత్రం అవకాశాలు చిక్కినా వదలొద్దు అంటూ మనసు ఆరాటపడుతుంది. ఇదే పరిస్థితిలో మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఉన్నారు. అసలే ప్రేమవివాహం. ఆపై మిత్రుల సమక్షంలో వివాహానంతర కార్యక్రమం. హద్దులుంటాయా చెప్పండి! మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ తమ పోస్ట్ వెడ్డింగ్ లో చేసిన హంగామా ఇప్పుడు వీడియో రూపాన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమ్మాయిగారు మౌనీరాయ్…
బాలీవుడ్ పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి సహజంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిందంటే… యోగాకు సంబంధించినవో, హెల్దీ ఫుడ్ కు సంబంధించినవో అనుకుంటాం. అయితే తాజాగా అందుకు భిన్నమైన వీడియోను శిల్పాశెట్టి పోస్ట్ చేసింది. తన పెరటిలోని చెట్టు కాయాలను ఎగిరెగిరి కోసిన వీడియోను పెట్టింది శిల్పాశెట్టి. అంతేకాదు… ఆ వీడియోతో పాటు ఆసక్తికరమైన విషయాలూ పొందుపర్చింది. మన చేతులతో నాటిన మొక్క… చెట్టుగా ఎదగడం, కాయలు కాయడం… వాటిని కోసుకునే ఛాన్స్ మనకు దక్కడం నిజంగా ఆనందకరమైన…
‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న సినిమా ‘ఎఫ్ 3’. 2019లో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని ఓ చిన్న ఫన్నీ వీడియో ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!వస్తే, కొద్దిగా ముందుగా. వెళ్ళినా కొద్దిగా వెనకగా!…