అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ ఇటీవలే ఓ శుభవార్త చెప్పారు. సరోగసి ద్వారా తామో బిడ్డకు తల్లిదండ్రులమయ్యామని ప్రకటించారు. దాంతో వీరికి బాలీవుడ్ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్త చాలామందికి సంతోషాన్ని కలిగించింది, కానీ ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్, నిర్మాత రితేష్ సిద్వానికి మాత్రం కొంత బాధను మిగల్చబోతోంది. గత యేడాది ఆగస్ట్ లో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, అలియా భట్ తో తన…
దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘బీస్ట్’ మూవీపై బాలీవుడ్ నిర్మాతల కన్నుపడింది. అయితే ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమా రీమేక్ హక్కుల్ని ఫ్యాన్స్ ఆఫర్ తో సొంతం చేసుకోవాలనుకుంటున్నాడట. పోటీపడుతున్న వారిలో ఇప్పుడు సాజిద్ దే పైచేయిగా…
‘ఉప్పెన’ సినిమాతో ఘనవిజయం అందుకున్న యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బాపినీడు బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సోమవారం ఈ సినిమా టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ యూత్‌ని మెప్పించేలా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య నడిచే బటర్ ఫ్లై కిస్ థియరీ కొత్తగా…
సుమంత్ నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైన ‘మళ్ళీ మొదలైంది’ మూవీని ఫిబ్రవరిలో ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేమికుల రోజు కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు జీ 5 సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన…
ప్రముఖ నిర్మాత కె. టి. కుంజుమన్ నిర్మించిన ‘జెంటిల్ మేన్, కాదలన్ (ప్రేమికుడు), కాదల్ దేశం’ (ప్రేమదేశం) వంటి చిత్రాలు తమిళ, తెలుగు భాషలలో బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. సినిమా పబ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ప్రముఖ నిర్మాత కె. టి. కుంజుమన్ జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై తన సూపర్ హిట్ సినిమా ‘జెంటిల్ మేన్’కు సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ట్విట్టర్ లో ఒక…
“కళ్ళ కింద క్యారీ బ్యాగులు…” ఉంటేనేం, కామెడీతో కబడ్డీ ఆడగలిగే సత్తా ఉంటే చాలు, నందులు నడచుకుంటూ రావలసిందే! అంతటి ధీమాతోనే ఎమ్.ఎస్.నారాయణ నవ్వులు పూయించారు. అందువల్లే ఎమ్మెస్ నారాయణను ఐదు సార్లు బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డులు వరించాయి. ఎమ్మెస్ నారాయణ తెరపై కనిపిస్తే చాలు, అసంకల్పితంగా ప్రేక్షకుల పెదాలు విచ్చుకొనేవి. ఇక ఆయన కదిలితే చాలు జనానికి చక్కిలిగింతలు కలిగేవి. నోరు విప్పి మాట్లాడితే కితకితలే! పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రులో 1951…
‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా,…
ఇవాళ యువ కథానాయకుడు నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును నిర్మాత ఉషా ముల్పూరి ఖరారు చేశారు. అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘కృష్ణ వ్రింద విహారీ’ అనే పేరు పెట్టారు. కృష్ణ, వ్రింద మధ్య సాగే ప్రణయ ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రంతో షిర్లే సేతియా కథానాయికా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రాధిక, ‘వెన్నెల’కిశోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ,…
నటసమ్రాట్ గా జనం మదిలో నిలచిపోయిన అక్కినేని నాగేశ్వరరావు నట పర్వంలో ఎన్నెన్నో విశేషాలు. తలచుకున్న ప్రతీసారి అవి అభిమానులకు ఆనందం పంచుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నిటిని మననం చేసుకుందాం… అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘ధర్మపత్ని’. పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1941లో వెలుగు చూసింది. ఏయన్నార్ తొలిసారి ప్రధానపాత్రలో తెరపై కనిపించిన సినిమా ‘సీతారామజననం’. ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా 1944లో విడుదలయింది. పురాణపురుషుడు…
ఏ రంగంలో రాణించాలన్నా కృషిని మించిన సూత్రం లేదు. అయితే చిత్రసీమలో మాత్రం కృషి కంటే అదృష్టం ముఖ్యం అంటూ ఉంటారు. గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా ఆవగింజంత అదృష్టం ఉంటేనే చిత్రసీమలో రాణించగలమని చెబుతారు సినీపెద్దలు. నవయువ కథానాయకుడు నాగశౌర్యలో ప్రతిభ ఎంతో ఉంది. ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలలో నటించేశాడు. కొన్ని అలరించాయి. మరికొన్ని జనాన్ని పులకింప చేయలేకపోయాయి. దాంతో స్టార్ డమ్ కోసమై నాగశౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా…