హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి బల్మూరి వెంకట్ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని, తెలంగాణాలో ఒకరినొకరు తిట్టుకొని ఢిల్లీలో కలుస్తున్నారన్నారు. అంతేకాకుండా కేసీఆర్కు దళిత బంధు ఇచ్చే అలోచన లేదని, అది కేవలం ఎన్నికల జిమ్మిక్కేనన్నారు. ఉప ఎన్నికలు ముగిసిన తరువాత…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకుంది. బీజేపీ తరఫున పోటీచేస్తున్న ఈటల రాజేందర్కు మద్దతుగా హేమాహేమీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ ఎంపీ విజయశాంతి. తెలంగాణ ఉద్యమంలో ఈటెల నేను కలిసి పని చేశాం. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ హుజురాబాద్ లో అడ్డా వేశారన్నారు. ఒక ఉద్యమ కారుడు ఈటల.. ఆలాంటి వ్యక్తిని ఎందుకు ఓడిస్తావు కేసీఆర్ అని ప్రశ్నించారు విజయశాంతి.…
హుజూరాబాద్ ఎన్నికల్లో వేడి పెరుగుతూనే వుంది. జమ్మికుంటలో మహిళల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు ఎందుకు ఓటువేయాలో ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు, టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఉందని, ఏడేళ్లలో ఏ యే వర్గానికి ఎంత మేలు జరిగిందో మీకు తెలుసు అన్నారు. ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలను కెసిఆర్ గుర్తించి పరిష్కరించారని..తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ అంతటా స్వచ్ఛమయిన…
మంత్రి అంటే.. ఆయన శాఖకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ఉంటుందని అనుకుంటాం. బాధ్యతలు చేపట్టిన కొత్తలో తెలియకపోయినా.. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు కొందరు. మరి.. ఆ ప్రయత్నం చేయలేదో ఏమో.. సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నకు గుడ్లు తేలేశారట మంత్రి పువ్వాడ అజయ్. ఆ సందర్భంగా పేలిన డైలాగులపైనే ఇప్పుడు చర్చ. ఆర్టీసీ బస్సుల లెక్కలు అడిగితే బిక్కముఖం వేసిన మంత్రి అజయ్? టీఆర్ఎస్ ప్లీనరీ.. తెలంగాణ విజయ గర్జన సభపై మాట్లాడేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో…
పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఇవాళ కూకట్పల్లి, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై కీలక సూచనలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలలో టీఆర్ఎస్ బలంగా ఉందని తెలిపారు.. పార్టీ ఉంటేనే పదవులు ఉంటాయి.. ఆ పార్టీ కోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.. ఇక, రాష్ట్ర ప్రజలకు, పార్టీ అధినేత,…
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. మంగళవారం హుజురాబాద్ లో ఈటలకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్, హరీష్ రావు ల స్నేహం మధ్య చిచ్చు పెట్టింది కేటీఆర్ అని, ఓటమి భయంతో ఏదో ఒకటి చెప్పాలని కేటీఆర్ చెప్తున్నారన్నారు. సుమన్ భాష మార్చుకోవాలి మొనగాడు ఎవరో సీఎం కేసీఆర్ ను అడిగితే చెప్తాడన్నారు. మేము కాంగ్రెస్ లో ఎందుకు పోతం బీజేపీ బలోపేతానికి…
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతున్నారనే వార్తలపై ఆయన స్పందిస్తూ .. అది కేవలం వాట్సాప్ యూనివర్సీటీ ప్రచారం మాత్రమేనని ఇలాంటి గ్లోబల్ ప్రచారాలను ఎవ్వరూ నమ్మోద్దన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడమనేది సందర్భానుసారాన్ని బట్టి ఉంటుందన్నారు. వాట్సాప్ లో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దెశిస్తూ కొండగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎందుకు రాజకీయ సన్యాసం…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఉద్ఘాటించారు. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై హుజురాబాద్ లో రాజకీయం చేస్తున్నాయన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం తాజాగా ప్రకటించారు. గతంలో మాదిరిగా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. వాటన్నింటిని పూర్తి చేశాకే ఎన్నికలకు వెళుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావించిన 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.‘విజయగర్జన’ పేరుతో నిర్వహించనున్న ఈసభకు దాదాపు 10లక్షల…
తెలంగాణ మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దక్కింది.. ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానాన్ని అందుకున్నారు కేటీఆర్.. ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే అంభిషన్ ఇండియా (ambition India- 2021) సదస్సులో ప్రసంగించాల్సిసిందిగా అక్కడి ప్రభుత్వం ఆహ్వానించింది.. గ్రోత్ – డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా(era) అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు మంత్రి కేటీఆర్.. ఈ నెల 29న ఫ్రెంచ్ సెనేట్లో జరిగే అంబిషన్ ఇండియా బిజినెస్…