హుజురాబాద్ ఉపఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో నాయకుల హడావుడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 8వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది అక్టోబర్ 13. పోలింగ్ 30న జరుగనుండగా ఫలితం నవంబర్ 2న వెలువనుందని ఈసీ ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. నేడు కూడా పలు పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో…
మహిళలు, ఆడ బిడ్డల పై అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగిపోతుంది. ఇక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తుంది కేసీఆర్ ఆ, కేటీఆర్ ఆ లేక హోం మినిస్టర్ ఆ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. ఐటీ పైన అసెంబ్లీ లో చెత్త పేపర్ ఇచ్చారు…. అందులో అంత అబద్ధమే. రామ గుండం పర్టిలైజర్ ఫ్యాక్టరీ ని కేంద్రమే స్థాపించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు కేంద్రం నిధులు ఇచ్చిన ఏర్పాటు చేయడం…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. GHMCలో కలిపేద్దామా..? మీ అభిప్రాయం చెప్పడంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంపై చర్చ జరుగుతోంది. సికింద్రబాద్ కంటోన్మెంట్ ప్రాంతంపై తెలంగాణ ప్రభుత్వానికి అజమాయిషీ లేదు. దీంతో అక్కడ నివసించే సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా… ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే దానిని జీహెచ్ఎంసీలో కలపాలని స్థానికులు కోరుకుంటున్నారంటున్నారు మంత్రి KTR. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి KTR కామెంట్స్‌పై హర్షం వ్యక్తం…
ఉదయాన్నే చాలా మంది చిన్నారులు పేపర్ వేస్తూ కనిపిస్తుంటారు. వివిధ కారణాల వలన బాల్యం నుంచే కష్టపడి పనిచేయాల్సి వస్తుంటుంది. జగిత్యాల పట్టణానికి చెందిన జయప్రకాశ్ అనే విద్యార్థి ఉదయాన్నే పేపర్ వేస్తుండగా ఓ వ్యక్తి చదువుకునే వయసులో పేపర్ ఎందుకు వేస్తున్నావ్ అని ప్రశ్నించగా, తప్పేముంది, పేపర్ వేస్తూ చదువుకోకూడగా అని ఎదురు ప్రశ్నించారు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేస్తూ చదువుకుంటే పెద్దయ్యాక ఏ పని చేయాలన్నా కష్టం అనిపించదు. అని సమాధానం చెప్పాడు. దీనిని…
అధికారపార్టీలో చిన్న పదవైనా ఎంతో డిమాండ్ ఉంటుంది. దానికి సెంటిమెంట్ కూడా తోడైతే పోటీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఓ పదవి కోసం విపరీతమైన పోటీనే నెలకొంది. కాకపోతే పాత విద్యార్థి.. కొత్త విద్యార్థి అనే పేరుతో యువ నేతల మధ్య రేస్ మొదలుకావడంతో ఆ పదవిపై ఉత్కంఠ పెరుగుతోంది. టీఆర్ఎస్వీ అధ్యక్ష పదవి కోసం పోటీ! సంస్థాగత పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది అధికారపార్టీ టీఆర్ఎస్. సెప్టెంబర్ 2 నుంచి పార్టీ నేతలంతా ఇదేపనిలో ఉన్నారు.…
ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందన్నారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు. కాగా, ఈరోజు సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసుపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు… రేవంత్‌రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది… పరువు నష్టం కేసులో ఇంజెక్షన్ ఆర్డర్‌పై వాదనలు ముగిశాయి.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు కేటీఆర్.. అయితే, మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది కోర్టు.. కాగా, తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పరువునష్టం దావా వేశారు.. తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో విచారణ పూర్తి అయ్యింది.. ఈ కేసులో విచారణ పూర్తిచేసిన సిటీ సివిల్ కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.. కాగా, రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులతో మంత్రి కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయని.. అలాగే డ్రగ్స్‌కు కేటీఆర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారంటూ…
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. ఇప్పటి వరకు అన్నీ ఓపికగా భరించాం.. ఇక, నోటికిఏదివస్తే అది మాట్లాడితే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అయితే, దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలి అంటూ సవాల్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా.. తాడ్వాయిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడతారా?…
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రైతు, రైతుబిడ్డ అయిన కెసీఆర్ ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం రైతు బంధు అనేది దేశంలో ఎవరికి రాని ఆలోచన, ప్రధాన మంత్రి కూడా ఈ పథకం స్పూర్తితో పీఎం కిసాన్ ను ప్రారంభించారు. రైతు భీమా పథకం ను మొట్టమొదటి గా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎవరికి ఒక పైసా లంచం లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ఒకే…