కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మహాధర్నాకు పిలుపు నిచ్చిన విషయం తెలసిందే… ఈ నేపథ్యంలో నేడు ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులతో మహాధర్నా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ధర్నా ముగిసిన తర్వాత రాజ్ భవన్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇందిరా పార్కు నుంచి పాదయాత్రగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు.. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో ఈ ధర్నాకు కేసీఆర్ పూనుకున్నారు. ఇప్పటికే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.