కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు టీర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ శ్రేణులు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్న నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలును కేంద్రం అపొద్దన్నారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం శీతకన్న ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని.. తెలంగాణ రైతు సమితి అంటూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందన్నారు. కేంద్ర ధాన్యం కొనుగోలు చేయకుంటే నిరసనలు ఉదృతం చేస్తామన్నారు.