తెలంగాణ ధాన్యం కొనుగోలు రచ్చ జరుగుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అధికారంలో ఉన్న టీఆర్‌స్ నేతలే రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ నేతలేమో రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు చేతకాక కల్లబొల్లి కబుర్లు చెబుతోందని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనాల్సిన వాళ్ళే రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని, మీకు చేత కాక చేతులు ఎతేశరా..? మాకు రాష్ట్ర పాలన చేత కాదని ధర్నా చేస్తున్నారా..? అని ప్రశ్నించారు.
Also Read: టీఆర్‌ఎస్ అంటే ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ కాదు : కేటీఆర్
రెండు ప్రభుత్వాలు కాకుండా ధాన్యం కొనేది అమెరికా నా..? పాకిస్థాన్ కొంటాయా..? అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేస్తూ.. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల పబ్బం గడుపుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అధికారం అంతా ఇంటికి పరిమితం చేసిందని,
ఇంటికి వచ్చిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తుందని ఆయన ఆరోపించారు.
‘ప్రభుత్వ ఆస్తులు అమ్మి వ్యవస్థలు కుప్పకుల్చేస్తున్నారని, జైజవాన్..జై కిసాన్ నినాదం మీద నడిసిన దేశం ఇది. ఇప్పుడు జవాన్ లేడు… కిసాన్ లేకుండా చేస్తున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి రైతుల్ని ఫుట్ బాల్ ఆడుతున్నారు. రెండు పార్టీల ను గమనించండి. మనం పండించిన పంట కొనే వరకు పోరాటం చేద్దాం. అదైర్యపడకండి. మాకు పరిపాలన చేత కాదు అని బీజేపీ, టీఆర్‌ఎస్ ఒప్పుకుని రోడ్డెక్కాయి. సమన్వయం చేసుకుంటూ పాలన చేస్తూ… ఉండాలి కానీ పోటా పోటీగా ధర్నాలు చేస్తున్నారు’ అంటూ విమర్శలు గుప్పించారు.