డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఇవాళ మంత్రి కేటీఆర్ ను కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఈ సందర్భంగా కేటీఆర్ కు అందచేశారు డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎం లకు లేఖ రాశారు స్టాలిన్. ఆ లేఖనే ఇవాళ మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా DMK ఎంపీ ఇలన్ గోవన్ మాట్లడుతూ.. నీటి పరీక్ష రద్దు అంశం పై…
ఈ నెల 25 వ తేదీన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను 17 న విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ.. . టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ క్షేత్ర స్థాయి నుంచి మొదలుకుని పట్టణ, మండల స్థాయి…
టీఆర్ఎస్ పార్టీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, పట్టణ కమిటీలు పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటైనట్టు కేటీఆర్ తెలిపారు. 2019 ఎన్నికల కారణంగా పార్టీ ప్లీనరీ కార్యక్రమం నిర్వహించలేకపోయామని, ఆ తరువాత కరోనా కారణంగా రెండేళ్లపాటు ప్లీనరీని నిర్వహించలేదని, నవంబర్ 15న వరంగల్‌లో విజయగర్జన జరుగుతుందని అన్నారు. ఇక పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు కేటీఆర్ తెలిపారు. అక్టోబర్ 17 వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్…
మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. అప్పుడు హరీష్ అన్నని గెలిపించాలని మళ్లీ మన యువకులు తిరగాల్సి వస్తది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈటల రాజేందర్ ను రాత్రికి రాత్రి…
టీఆర్ఎస్ సర్కార్‌లో పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేదర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దళిత జాతి ఆత్మగౌరవం కోసం నా చిన్న నాడే కొట్లాడి మా కుల బహిష్కరణకు గురైన వాళ్లం.. అలాంటి కుటుంబం మాది అని గుర్తు చేసుకున్నారు.. ఇక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాడిని.. కేసీఆర్‌తో ఆరేళ్లుగా అనుభవిస్తున్న బాధ…
దేశంలో నాలుగో మెట్రో నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించింది అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేది. హైదరాబాద్ లో ఎక్కడ, ఎలాంటి సంఘటన జరగలేదు. అందర్ని కలుపుకుని ప్రభుత్వం ముందుకు పోతుంది అని తెలిపారు. కేసీఆర్ అందర్ని సమతుల్యంగా చూస్తున్నారు. జీహెచ్ఎంసిలోని 675 స్కోయర్ మీటర్లు. 102 స్కోయర్ మీటర్ల పరిదే పాత నగరం. మౌలిక వసతుల కల్పన కోసం దృఢ సంకల్పంతో పని చేస్తున్నాం.…
తెలంగాణ శాసన మండలి వేదికగా… కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేంద్రం చెప్పిన 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఒక పెద్ద మిధ్య అని…చిన్న మధ్య తరహా పారిశ్రామిక వేత్తలను ఆదుకోవాలని అనేక మార్లు లేఖలు రాసినా.. కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. కరోనా కారణంగా ఎంఎస్ఎంఈ లు మూతపడ్డాయన్నారు. కేంద్రం దేశంలోని పారిశ్రామిక వేత్తలను పరిశ్రమలను కాపాడుకోవడానికి రూ. 20 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నామని ప్రకటించిందని…కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.…
నిజామాబాద్ జిల్లా లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురా లు వైయస్ షర్మిల నేడు పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… వైయస్సార్ వల్ల 2006 సంవత్సరంలో నిజామాబాద్ బిడ్డల కోసం యూనివర్సిటీ ప్రారంభమైందని… తెలంగాణ యూనివర్సిటీ సమస్యల యూనివర్సిటీ నిలయం గా మారిందని తెలిపారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు కనీసం నిధులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని…తెలంగాణ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం కేటీఆర్ కు 2 కోట్లు డబ్బులు చెల్లించినట్లు ఆరోపణ ఉందని పేర్కొన్నారు.…
రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య ను మంత్రి కేటీఆర్ అభినందించారు. రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా….నిబంధనలు అందరికీ ఒకటే అని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళల ముందు…