టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.. రోడ్డు ప్రమాదానికి గురై రాత్రి సమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి బాసటగా నిలిచారు.. తన కాన్వాయ్‌లోనే ఆస్పత్రికి తరలించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే బుధవారం రాత్రి సమయంలో మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు.. హకీంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. గాయాలపాలై సాయం కోసం ఎదురుచూస్తోన్న సమయంలో.. అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్.. ఆ దృశ్యాలను గమనించారు.. వెంటనే కాన్వాయ్‌ని ఆపి కిందికి దిగారు.. విద్యార్థులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.. ఇక, రక్తమోడుతున్న ఆ విద్యార్థులను తన ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.. ఆ తర్వాత ఆ విద్యార్థుల పరిస్థితిపై ఆస్పత్రిలో ఆరా తీశారు.
Read Also: నవంబర్ 18, గురువారం దినఫలాలు…
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యపై స్పందిస్తూనే ఉంటారు.. ఆ సమస్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేయడం.. లేదా తన కార్యాలయానికి వచ్చి కలవమని చెప్పడం.. వారికి తగిన విధంగా సాయం అందేలా చేస్తుంటారు కేటీఆర్.. ఆయనకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అదేస్థాయిలో ఉంటుంది. ఇక, రోడ్డు ప్రమాద బాధిత విద్యార్థులను ఆస్పత్రికి తరలించి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు యంగ్ లీడర్ కేటీఆర్. సమయానికి ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు నిలిపారు.