2009, డిసెంబర్ 9కి తెలంగాణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరిన సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. అప్పటికే ఆయన దీక్షలో ఉండి కొన్ని రోజులు అవుతుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకు విషమిస్తుంది. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి చిందబరం తెలంగాణ ఏర్పాటు పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ…
ఢిల్లీ లో టీ ఆర్ ఎస్ ఎంపీ లు కడుపు లో పేగులు తెగే దాకా కొట్లాడారని, కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు కొట్లాడకున్నా టీ ఆర్ ఎస్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు. వాళ్లు మనుషులా పశువులా? బీజేపీ ఎంపీ పశువులా మమ్మల్ని బియ్యం స్మగ్లర్లు అంటున్నాడు. ఇలాగేనా రాజకీయాలు చేసేది. మేం జవాబు దారీ అంటే అదీ తెలంగాణ ప్రజలకే.. ఢిల్లీ కి గుజరాత్ లకు మేము…
హైదరాబాద్ టీఆర్ఎస్ హయాంలో గ్లోబల్ సీటీగా అభివృద్ధి చెందడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ ఎఫ్ 21 వింగ్స్ తయారీ హైదరాబాద్లో చేపట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీలలో హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్గా ఉండటం హైదరాబాదీలకే కాదు మొత్తం తెలంగాణకే తలమానికమన్నారు కేటీఆర్. వెయ్యికి పైగా ఏరోస్పేస్ కాంపోనెంట్ పరిశ్రమలు హైదరాబాద్లోనే ఉన్నాయని తెలిపారు కేటీఆర్. అమెరికా మరియు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ కు…
అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ప్రగతి భవన్ లో నివాళులు అర్పించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… స్వతంత్రం వచ్చిన తొలి నాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భారతదేశ భావి భవిష్యత్తు అవసరమైన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయం అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్ష అయిన ప్రత్యేక…
రాజన్న సిరిసిల్లా జిల్లాలో మాజీ మేయర్, కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై మంత్రి కేటీఆర్ పై విమర్శల దాడులకు దిగారు. సిరిసిల్ల మునిగిపోతుంటే మంత్రిగా కేటీఆర్ ఏం చేస్తున్నారు. మీరు కేవలం ఐటీమంత్రిగానే పనిచేస్తారు… మీరు మున్సిపల్ మంత్రిగా పనికిరారు. 500 సెక్షన్లు ఉన్న మున్సిపల్ చట్టాన్ని 200 సెక్షన్లుగా మార్చి.. కౌన్సిలర్లను, కార్పోరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత…
తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ ఈరోజు మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ప్రగతిభవన్లో కలిశారు. తన జీవితం ఆధారంగా వచ్చిన “పూర్ణ” పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ కి అందించారు. పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం పట్ల పూర్ణ మంత్రి…
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా మహామ్మరి కొత్తగా ఓమిక్రాన్ రూపంలో మరోసారి దేశాలను భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వేరియంట్ను గుర్తించిన శాస్త్రవేత్తలు దీని వ్యాప్తి చాలా వేగంగా ఉందని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటికే పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. విమాన ప్రయాణాలను సైతం రద్దు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన…
వానాకాలం వరి ధాన్యాన్ని ఎంతకొంటామనే విషయంపై కేంద్రం ఎటూ తేల్చలేదు. యాసంగి లో పండే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని ఖరాఖండి గా తేల్చిచెప్పింది కేంద్రం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలతో న్యూ ఢిల్లీలో మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్., కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ లతో విడి విడిగా దాదాపు మూడున్నర గంటల పాటు సుధీర్గంగా చర్చించారు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఉన్నతాధికారుల బృందం. రాష్ట్రం నుంచి…
కేసీఆర్, కేటీఆర్ తండ్రీ కొడుకులు ఇద్దరూ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులేనని మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్ర శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే కేటీఆర్ ఉలిక్కి పడుతున్నాడన్నారు. తెలంగాణ రైతులను ఆదు కొమ్మంటే, పంజాబ్ రైతులకు రూ.3 లక్షలు ఇస్తా అంటు న్నాడని ఎద్దేవా చేశారు. ఈ 7 ఏళ్లలో మీ అసమర్థ పాలన వల్ల, మీరు చేసిన ద్రోహం వల్ల వేల మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాల వైపు…
తెలంగాణ సీఎం కేసీఆర్ను దేశద్రోహి అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోవిడ్ తీవ్రత, చలి ఉన్నప్పటికీ ఏడాదికి పైగా కాలంగా రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు ఆందోళన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతులకు అండగా నిలబడ్డ వారు దేశద్రోహులు అవుతారా అంటూ కేటీఆర్ విమర్శించారు. దేశ భక్తిపై సర్టిఫికెట్ ఇవ్వడానికి అసలు వీళ్లేవరూ అంటూ ఆయన స్పం దించారు. కాగా రైతు…