కేంద్ర మంత్రులు నిర్మలాసీతారమన్, మహేంద్రనాథ్‌లకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేక రాశారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను కేంద్రం పునఃప్రారంభించాలని కోరుతూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. సీసీఐ యూనిట్ తెరిచేందుకు సానుకూల అంశాలున్నాయని ఆయన అన్నారు. దేశీయంగా సిమెంట్‌కు భారీ డిమాండ్ ఉందని, ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు లాభాలు అర్జిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అయితే సీసీఐ తెరిచేందుకు రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కంపెనీ ప్రారంభిస్తామంటే కొత్త కంపెనీలకు ఇచ్చే ప్రోత్సహకాలు, వెసులుబాటు కల్పిస్తామని ఆయన లేఖలో వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయంపై కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తు చేశారు. సీపీఐ తెరిస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు.