చీప్ లిక్కర్‌పై తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ.70కే చీప్ లిక్కర్ అందిస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగైతే రూ.50కే అమ్ముతామంటూ ప్రకటించారు.. అయితే, దీనిపై పెద్ద రచ్చే జరిగింది.. ఇదేనా బీజేపీ విధానం అంటూ సోషల్ మీడియా వేదికగా పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీపై దుమ్మెత్తిపోశారు.. ఆయన సోమువీర్రాజు కాదు.. సారాయి వీర్రాజు అంటూ సెటైర్లు వేశారు.. అయితే, మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. యాభై రూపాయలకు లిక్కర్ అమ్మితే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రెండు లక్షల రూపాయలు మిగులుతాయని లెక్కలు వేశారు సోము వీర్రాజు.
Read Also: ఒమిక్రాన్, కరోనాపై హైకోర్టులో విచారణ.. తప్పకుండా పాటించాలని ఆదేశాలు
ఇక, నేను లిక్కర్ గురించి పేదవాడిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాను అన్నారు ఏపీ బీజేపీ చీఫ్.. ఆరు రూపాయల బాటిల్‌ను 200 రూపాయలకు అమ్మడాన్ని నేను ప్రోత్సహించనన్న ఆయన.. నన్ను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో నాకు తెలుసు అంటూ సెటైర్లు వేశారు.. నాపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము మూడు గంటల వరకూ ఏం చేస్తారు? అని ప్రశ్నించిన సోము వీర్రాజు.. బీజేపీ ఏ విషయమైనా సమయం, సందర్భంతో మాట్లాడుతోందన్నారు. మరోవైపు.. నేను సారాయి వీర్రాజు కాదు.. బియ్యం వీర్రాజుని, సిమెంటు వీర్రాజుని, కోడిగుడ్ల వీర్రాజుని అన్నారాయన.. నేను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024లో బీజేపీ మ్యానిఫెస్టోలో పెడతామని స్పష్టంచేశారు.. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సమస్యకు బీజేపీ దగ్గర పరిష్కారం ఉందని వెల్లడించారు.