తెలంగాణ మంత్రులు హరీష్, కేటీఆర్ లకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గోవా, దుబాయ్ లు తిరిగే బదులు.. ఛత్తీస్ ఘడ్ రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ఇంకెక్కడైనా ఉన్నాయా అని టీఆర్ ఎస్ నేతలు అంటున్నారని.. ఛత్తీస్ ఘడ్ వస్తే అక్కడి అభివృద్ధి చూపిస్తానని ఛాలెంజ్ విసిరారు.
వరి కాకుండా ఇంకో పంట సాగు చేస్తే… ఎకరాకు 9 వేల సాయం చత్తీస్ ఘడ్ ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్, హరీష్ వస్తే… అక్కడి సీఎంతో మాట్లాడి అతిథిగా తీసుకెళ్తానని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మానవ మృగాలుగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి బాహ్యమైన రాజకీయాలు చేస్తున్నారని… చట్టంలో మద్దతు ధర ఉన్న పంటకు రైతులకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. యాసంగిలో వడ్లు వేయాలని.. ఎట్లా కొనడో చూద్దామని స్పష్టం చేశారు.