రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగు లో గల్లంతయ్యి మరణించిన చిన్నారుల కుటుంబాలను ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందించి భవిష్యత్తులో అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక్కొక్క బాధితు కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందించారు మంత్రి కేటీఆర్. వర్కర్స్ టూ ఓనర్ పథకం కింద శ్రీరాము, క్రాంతి కుమార్…
‘కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు’ అంటూ హీరో సుధీర్ బాబు చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. హైటెక్స్‌లో జరిగిన ‘ఇండియా జాయ్’ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఇదే వేడుకకు నటుడు సుధీర్ బాబు కూడా విచ్చేశారు. ఆయన తన స్పీచ్ లో భాగంగా కేటీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుధీర్ బాబు మాట్లాడుతూ “నేను కేటీఆర్‌కి పెద్ద అభిమానిని. ఆయన మంచి రాజకీయ నాయకుడు…
ప్రస్తుతం దేశంలో ఓటీటీ, గేమింగ్ కు ఆదరణ పెరుగుతోందని…తాను కూడా ఓటీటీకి అభిమానిని అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆసియాలోని అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ‘ఇండియాజాయ్’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టెక్నికలర్ ఇండియా కంట్రీ హెడ్, సిఐఐ నేషనల్ ఏవిజిసి సబ్ కమిటీ ఛైర్మన్ బీరెన్ ఘోష్, మొబైల్ ప్రీమియర్ లీగ్ సహ వ్యవస్థాపకులు & సీఈఓ శ్రీ సాయి శ్రీనివాస్, సినీ నటుడు…
తెలంగాణలో ఎమ్మెల్యే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌కు సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై చర్చించి ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటా లో ఒకటి…
తెలంగాణ ధాన్యం కొనుగోలు రచ్చ జరుగుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అధికారంలో ఉన్న టీఆర్స్ నేతలే రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ నేతలేమో రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు చేతకాక కల్లబొల్లి కబుర్లు చెబుతోందని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనాల్సిన వాళ్ళే రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని, మీకు చేత కాక చేతులు ఎతేశరా..? మాకు రాష్ట్ర పాలన చేత…
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు టీర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్న నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలును కేంద్రం అపొద్దన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం శీతకన్న ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని.. తెలంగాణ రైతు సమితి అంటూ.. టీఆర్ఎస్…
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు…
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను స్పూర్తిగా తీసుకొని సుభాష్‌రెడ్డి అనే వ్యక్తి కామారెడ్డి జిల్లాలోని బీబీపేటలో పాఠశాలను 8 కోట్లతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన ఈ పాఠశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతేకాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్వరలోనే శ్రీమంతుడు బృందంతో ఈ స్కూలును సందర్శిస్తానని.. అంతేకాకుండా తన సినిమా స్పూర్తితో ఈ పాఠశాల…
తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని కోరేందుకు కేటీఆర్‌తో కలిసి ఢిల్లీలో పీయూష్ గోయల్ కలిశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పంటల కొనుగోలు బాధ్యత కేంద్రానిది, రాజ్యాంగం ప్రకారం అది కేంద్రం బాధ్యత అని విజ్ఞప్తి చేశామన్నారు. దానికి పీయూష్ గోయల్ వెకిలినవ్వు నవ్వారు .. ఇప్పటికే నిల్వలు మురిగిపోతున్నాయి .. కొననే కొనం అని అన్నారని వెల్లడించారు. మాది కొత్త రాష్ట్రం.. ఇప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం అని కోరినా పట్టించుకోలేదు .. క్రాప్ చేసుకోండి అని…
కోయగూడెం నుంచి ప్రతిష్టాత్మక ఐఐటీలో స్థానం సంపాదించుకున్న నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థి కారం శ్రీలతకి మంత్రి కే తారకరామారావు అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెం కి చెందిన శ్రీలత చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది. తన నిరుపేద పరిస్థితులను దాటుకుని ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను సాధించింది. నాగర్ కర్నూల్ లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి…