తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. తీన్మార్ మల్లన్న పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కుటుంబంపై మరోసారి మాట్లాడితే ముక్కలుగా నరికేస్తానన్నారు. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే.. మూడు వందల ముక్కలుగా నరికేస్తాం. ఎక్కువ మాట్లాడితే నేనే ఇంటికి వచ్చి కొడతా. క్రమశిక్షణ గల బీజేపీ తీన్మార్ మల్లన్న కి నేర్పేది ఇదేనా? అన్నారు. తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్లో పోల్ పేరిట కేటీఆర్ తనయుడు హిమాన్షుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. మంత్రి కేటీఆర్, ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్…తీవ్రంగా ఆక్షేపించారు. ఇలాంటి వ్యాఖ్యలు దుర్మార్గం అన్నారు. చింతపండు నవీన్ కి చెంపదెబ్బలు, చెప్పుదెబ్బలు తప్పవన్నారు.