హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు కానుంది. ఇవాళ ఇటలీకి చెందిన డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం మధ్య MoU జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఏడున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్నారు. కనీసం ఈసారైన కేంద్ర బడ్జెట్లో అయినా రాష్ట్ర…
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు కానుంది. ఇవాళ ఇటలీకి చెందిన డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం మధ్య MoU జరగనుంది. ఆయిల్ రిగ్గుల తయారీలో అంతర్జాతీయ స్థాయి సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న డ్రిల్మెక్.. 200 మిలియన్ US డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనుంది. మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్మెక్. డ్రిల్మెక్ సీఈవో అలెక్స్‌కు MoU కాపీని పరిశ్రమలు, ఐటిశాఖ…
రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఎల్లుండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారని కేటీఆర్ అన్నారు.. అలాగే ఇంటింటికీ నీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు.…
జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో పట్టణీకీకరణ భారీ ఎత్తున పెరుగుతుందని, ఫలితంగా పట్టణ పేదరికం కూడా పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. పట్టణాలకు వచ్చే పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం వారి ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. పట్టణ పేద ప్రజలు కనీస అవసరాలను అందుకునేలా వారి ఉపాధి హామీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని…
తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం పైసా నిధులివ్వడంలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మాటలు, ప్రశంసలతోనే కేంద్రం కాలం వెళ్లదీస్తుందన్నారు. పైగా రాష్ట్రాల విషయాలలో అడ్డుతగులుతుందని ఆరోపించారు. ఐఎఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఎస్ అధికారులు స్వేచ్ఛగా పని చేయకుండా,సర్వీసు రూల్స్‌ను సవరిస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించే ప్రయత్నాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. Read Also: పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవద్దా..?…
కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను మీడియా ద్వారా కోరుతున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాలుడు. తన అక్క, బావ వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నాడు. తనకు కారుణ్య మరణం కు అవకాశం ఇవ్వాలని అంటున్నాడు.ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి చెందిన గోరింట్ల లక్ష్మీనారాయణ మండలం లోని బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడి గా పని చేసేవాడు. అనారోగ్యంతో ఆయన మరణించడం తో ఆయన భార్య సుజాత…
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులను కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు రాసిన లేఖల్లో మంత్రి కేటీఆర్ కొరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో…
గాజులరామారంలో స్పోర్ట్స్ పార్కుతో పాటు ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్కు, చింతల్ భగత్‌సింగ్ నగర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను వచ్చే వారంలో ప్రారంభించనున్నారు. ఈ సౌకర్యాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోన్లో ఉన్నాయి. ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను అందిస్తుంది అని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లండించారు. టీఎస్ఐఐసీ ఏరియా, గాజులరామారం వార్డులోని స్పోర్ట్స్ పార్కును కూడా జీహెచ్ఎంసీ రూ.198.50 లక్షలతో నిర్మించింది. భగత్ సింగ్ నగర్ లో…
రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర వాటాగా రాబోయే యూనియన్ బడ్జెట్లో రూ.7,778 కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం కోరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ కేపీహెచ్ బీ-కోకాపేట్-నార్సింగి కారిడార్, వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్ట్‌తో పాటు మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (MRTS), మెట్రో నియో నెట్‌వర్క్‌తో సహా పలు ప్రాజెక్టులకు నిధులు కోరారు. స్ట్రాటజిక్…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్ దగ్గర హల్ చల్ చేశారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రగతి భవన్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు జేసీ దివాకర్ రెడ్డి.. అయితే, అపాయింట్మెంట్ లేకుండా సీఎంను కలిసేందుకు లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు.. కానీ, సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కాకుంటే మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు జేసీ దివాకర్‌రెడ్డి… ఇక, పోలీసులు ఎంత…