పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ కల్యాణ్‌ల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే విజయవాడలోని కృష్ణలంకలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ చిత్రపాటలతో భారీ ఫ్లెక్సీలను పవన్ అభిమానులు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సీఎం సర్ అంటూ పోస్టింగ్ పెట్టారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీపై మీడియాలో కథనాలు రావడంతో కార్పొరేషన్ సిబ్బందిని పంపించి ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో పవన్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.