తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తిచేయాల్సి వుందని డిప్యూటీ స్పీకర్ అన్నారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పద్మారావు పై ఎమ్మెల్యే రసమయు అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలే అడుగుతున్న … మాట్లాడే అవకాశం రాదు. కనీసం ప్రశ్న అడిగే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎట్లా? వద్దంటే కుసుంటా.? ప్రశ్నలు అడగండి… పది మంది మాట్లాడాలి అంటూ వారించారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు. ప్రశ్నలే అడగండి… ప్రసంగం వద్దు. గంటన్నర లో 10 ప్రశ్నలు పూర్తి చేసుకోవాలన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు.