నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండకు చేరుకుంటారు. వారికి బైక్ ర్యాలీలతో టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకనున్నారు. ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ,ఎస్టీ హాస్టల్ ప్రారంభం. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ…
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పురపాలికలు మేయర్లు,చైర్పర్సన్, కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాలు, పల్లెల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో…
రాష్ర్టానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో ఎన్నో సంస్థలు వచ్చాయని, ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని మంత్రి అన్నారు. ఇప్పుడు అమూల్ సంస్థ రాష్ర్టానికి రావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని కేటీఆర్ అన్నారు.రాష్ర్ట ప్రభుత్వం, అమూల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేటీఆర్ తెలిపారు. Read Also: వైసీపీ పతనం ప్రారంభమైంది: జీవీఎల్ నరసింహరావు ఒప్పందంలో భాగంగా బేకరీ తయారు ప్లాంట్‌ను…
ఏపీలో నిన్న బీజేపీ జనాగ్రహ సభ నిర్వహించింది. అయితే సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచిందని.. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.75 లకే ఇస్తామన్నారు. వీలైతే రూ.50కే చీప్ లిక్కర్ ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఏపీలోని వైసీపీ, టీడీపీ నేతలు సైతం సోము వీర్రాజు మాటలపై మండిపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ఐటీ శాఖ…
భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో టీఎస్బి-పాస్‌ను దేశంలోనే ఆదర్శంగా నిలపాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు మున్సిపల్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పైన మంత్రి కె. తారకరామారావు సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతినిపురోగతిపై మంత్రి కె. తారకరామారావు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణాల రూపురేఖలను సమగ్రంగా…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. తీన్మార్ మల్లన్న పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై మరోసారి మాట్లాడితే ముక్కలుగా నరికేస్తానన్నారు. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే.. మూడు వందల ముక్కలుగా నరికేస్తాం. ఎక్కువ మాట్లాడితే…
తెలంగాణ మంత్రులు హరీష్, కేటీఆర్ లకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గోవా, దుబాయ్ లు తిరిగే బదులు.. ఛత్తీస్ ఘడ్ రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ఇంకెక్కడైనా ఉన్నాయా అని టీఆర్ ఎస్ నేతలు అంటున్నారని.. ఛత్తీస్ ఘడ్ వస్తే అక్కడి అభివృద్ధి చూపిస్తానని ఛాలెంజ్ విసిరారు. వరి కాకుండా ఇంకో పంట సాగు చేస్తే… ఎకరాకు 9 వేల సాయం చత్తీస్ ఘడ్ ప్రభుత్వం చేస్తుందని…
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరుతూ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ రేడు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. బండి సంజయ్‌ది ఉద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష అంటూ ధ్వజమెత్తారు. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని, బీజేపీ ప్రభుత్వం…
బిజెపి నేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన ఓ మీడియా సంస్థ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ప్రస్తావనతో ట్విటర్లో ఓ పోల్ క్వశ్చన్‌ను పోస్ట్ చేసింది. బాడీషేమింగ్‌తో కూడిన ఆ పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై హిమాన్షు తండ్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ సోదరి కవితతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తదితరులు ఖండించారు.…
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బిజెపి కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు కేటీఆర్. సాగు చట్టాలను రద్దు చేయడం.. మోడీ క్షమాపణలు చెప్పడం ఎన్నికల స్టంటేనని బీజేపీ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సాగు చట్టాలను రద్దు చేశామని మోడీ అంటారని… సాగు చట్టాలు మళ్లీ తెస్తామని కేంద్ర మంత్రి అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. బిజెపి రాజకీయాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని…