సూపర్ హిట్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ అధికారిక రీమేక్ “భీమ్లా నాయక్”. ‘భీమ్లా నాయక్’లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, బ్రహ్మాజీ, రఘుబాబు, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలుపోషిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటీనటులు, సిబ్బంది అంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని తదితరులు హాజరయ్యారు. అయితే ఈ వేడుక ఇంత భారీగా జరిగినప్పటికీ అందులో నిత్యామీనన్ మాత్రం కన్పించలేదు. దీంతో “భీమ్లా నాయక్” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిత్యా మీనన్ ఎందుకు దాటవేసిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Read Also : Poonam Kaur : ఆర్జీవీని టార్గెట్ చేసిన బ్యూటీ… మరో డైరెక్టర్ నీ వదల్లేదుగా !!
కొద్ది రోజుల క్రితం నిత్య హైదరాబాద్‌లో ఆహా కోసం “ఇండియన్ ఐడల్” తెలుగు వెర్షన్ కర్టెన్ రైజర్ ఈవెంట్‌కి హాజరైంది. కానీ ఇంత భారీ ఈవెంట్ కు మాత్రం రాలేదు. అయితే కనీసం సోషల్ మీడియాలోనైనా ఆమె “భీమ్లా నాయక్” గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. టీంతో ఆమెకు ఏవైనా విభేదాలు ఉండొచ్చనే టాక్ నడుస్తోంది. కానీ నిత్యామీనన్ నటన గురించి పవన్ కళ్యాణ్ ఈవెంట్ లో మాట్లాడడం చూస్తుంటే అదంతా నిజం కాదనిపిస్తోదని. మరోవైపు ఆమె ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉందని, అందుకే ఈవెంట్ కు రాలేదని చెబుతున్నారు. మరి ఆమె ఈవెంట్ కు ఎందుకు హాజరు కాలేదో ఎవరికి అంతుపట్టని ప్రశ్నగా మారింది.