కేంద్ర బడ్జెట్‌పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎనిమిదో బడ్జెట్లో కూడా తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు.. ఒకవైపు పవర్‌లూం, చేనేత కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది.. కానీ, కేంద్రం ప్రభుత్వం ఏడున్నార సంవత్సరాలుగా అండగా నిలబడండని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు.. సిరిసిల్లకు మెగా పవర్ రూమ్ క్లస్టర్ ఇవ్వండి అని అడిగినా మొండిచేయి చూపిస్తున్నారన్న ఆయన.. పవర్‌లూం క్లస్టర్ లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్…
ఎన్టీఆర్ గార్డెన్స్‌లో త్వరలో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లో, ఒకవైపు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన 2BHK హౌసింగ్ సైట్లలో ఇదొకటి, కొత్త సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం త్వరలో రానుంది.” అని కేటీఆర్ వెల్లడించారు. ఖైరతాబాద్ వార్డులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్…
సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.…
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు కానుంది. ఇవాళ ఇటలీకి చెందిన డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం మధ్య MoU జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఏడున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్నారు. కనీసం ఈసారైన కేంద్ర బడ్జెట్లో అయినా రాష్ట్ర…
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు కానుంది. ఇవాళ ఇటలీకి చెందిన డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం మధ్య MoU జరగనుంది. ఆయిల్ రిగ్గుల తయారీలో అంతర్జాతీయ స్థాయి సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న డ్రిల్మెక్.. 200 మిలియన్ US డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనుంది. మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్మెక్. డ్రిల్మెక్ సీఈవో అలెక్స్‌కు MoU కాపీని పరిశ్రమలు, ఐటిశాఖ…
రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఎల్లుండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారని కేటీఆర్ అన్నారు.. అలాగే ఇంటింటికీ నీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు.…
జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో పట్టణీకీకరణ భారీ ఎత్తున పెరుగుతుందని, ఫలితంగా పట్టణ పేదరికం కూడా పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. పట్టణాలకు వచ్చే పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం వారి ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. పట్టణ పేద ప్రజలు కనీస అవసరాలను అందుకునేలా వారి ఉపాధి హామీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని…
తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం పైసా నిధులివ్వడంలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మాటలు, ప్రశంసలతోనే కేంద్రం కాలం వెళ్లదీస్తుందన్నారు. పైగా రాష్ట్రాల విషయాలలో అడ్డుతగులుతుందని ఆరోపించారు. ఐఎఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఎస్ అధికారులు స్వేచ్ఛగా పని చేయకుండా,సర్వీసు రూల్స్‌ను సవరిస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించే ప్రయత్నాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. Read Also: పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవద్దా..?…
కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను మీడియా ద్వారా కోరుతున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాలుడు. తన అక్క, బావ వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నాడు. తనకు కారుణ్య మరణం కు అవకాశం ఇవ్వాలని అంటున్నాడు.ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి చెందిన గోరింట్ల లక్ష్మీనారాయణ మండలం లోని బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడి గా పని చేసేవాడు. అనారోగ్యంతో ఆయన మరణించడం తో ఆయన భార్య సుజాత…
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులను కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు రాసిన లేఖల్లో మంత్రి కేటీఆర్ కొరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో…