పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి క్రేజీ కాంబోలో వస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “భీమ్లా నాయక్” గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్నాడు. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం. అందులో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతారంటూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
Read Also : NBK107 : పిక్ లీక్… టాక్ ఆఫ్ టౌన్ గా బాలయ్య కొత్త లుక్
ఇక “భీమ్లా నాయక్” చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా, సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా 2020లో వచ్చిన బ్లాక్ బస్టర్ మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్”కి రీమేక్. నిత్యామీనన్, సంయుక్తా మీనన్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.