తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా.. ఇద్దరూ ఇద్దరే… సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ.. అన్ని సమస్యలపై స్పందిస్తుంటారు.. వీరి పోస్టులు ఓసారి ఆలోచింపజేస్తే.. మరోసారి నవ్వు పెట్టిస్తాయి.. ఇంకోసారి పెట్టుబడులు తెస్తాయి.. మరికొన్ని సార్లు కొత్త ప్రాజెక్టులకు అడుగులు వేస్తాయి.. అయితే, సోషల్ మీడియా వేదికగా.. ఒకరికొరరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. దానికి ప్రధాన కారణం మాత్రం.. ‘ఫార్ములా ఈ’గానే చెప్పాలి.. ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ’ వరల్డ్ ఛాంపియన్షిప్…
ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.. ప్రపంచంలోనే పేరుమోసిన సంస్థ టెస్లా.. అధునాతన టెక్నాలజీతో వాహనాలను ప్రవేశపెడుతూ.. ఎప్పటికప్పుడూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. టెస్లా కార్లు భారత్‌కు ఎప్పుడొస్తాయి అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్నా.. తాజాగా.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించడంతో.. మరోసారి ఈ వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక అంశాలపై స్పందించే తెలంగాణ మంత్రి కేటీఆర్.. వెంటనే ఈ అంశంపై…
శతాబ్దపు ఘన చరిత్ర కలిగిన కోఠి ఉమెన్స్ కాలేజ్ కు మహిళా విశ్వ విద్యాలయం హోదా త్వరలోనే దక్కనుంది. దీని కోసం గతంలోనూ కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేయగా… కార్యరూపం దాల్చలేదు. కానీ.. ఈ విడత సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడంతో కోఠి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో కేటీఆర్ తాజాగా కోఠి మహిళా యూనివర్సిటీ ప్రతిపాదనను చర్చకు…
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కేసీఆర్ సర్కార్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడులకు దిగారు. అయితే ఈ సారి ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలియనిది అడిగితే పాపం KTR ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది..మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్‌కు బానిస చెయ్యడం ఎలా? రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా…
కరోనా మళ్లీ భారత్‌ను వణికిస్తోంది.. థర్డ్ వేవ్ దెబ్బకు రికార్డు స్థాయిలో రోజువారి కేసులు పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు విధిస్తున్నాయి.. మరోవైపు, వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ కోవిడ్ నిబంధనలు తప్పితే.. అదనంగా ఎలాంటి ఆంక్షలు లేవు.. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు నెటిజన్లు..…
మా సుపరిపాలన-సుస్థిరతే బీజేపీ ద్వేష పూరిత ప్రచారానికి సరైన సమాధానమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రాతినిథ్యం వహించడం నా అదృష్టమని కేటీఆర్ అన్నారు. ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ విమర్శల దాడులకు దిగారు. బీజేపీ విషపూరిత ఎజెండాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. ఓ నెటిజన్ జాతీయ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి..? మిమ్ముల్ని భారతదేశానికి ఐటీ మంత్రిగా చూడాలనుకుంటున్నాం అంటూ ట్వీట్ చేయగా సొంత రాష్ట్రానికి…
పంజాబ్‌లో జరిగిన ఘటన పై తెలంగాణ ప్రజలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ముసుగులో ప్రధాని ప్రాణానికే ప్రమాదం కలిగే పన్నాగం కాంగ్రెస్ పన్నిందని ఆయన ఆరోపించారు. మన రాష్ట్ర మంత్రి కేటీఆర్ బాధ్యత రహితంగా, హేళనగా మాట్లాడారని, అక్కడి ప్రభుత్వ లోపాలను ఖండించాల్సింది పోయి.. బీజేపీ తెలంగాణలో బలోపేతం అవుతున్నదని అక్కసుతో మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్ కి వత్తాసు పలుకుతున్నారు…
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ పై నిప్పులు చెరిగారు.కేసీఆర్‌కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలేనన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏడున్నరేళ్లలో 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని షర్మిల అన్నారు.…