బోధన్ లో హిందూ యువకులపై ఎం ఐ ఏం, టీ ఆర్ ఎస్, పోలీసులు కలిసి దాడి చేశారన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. బోధన్ లో శివాజీ విగ్రహం పెట్టడం కోసం మున్సిపాలిటీ తీర్మానం చేసింది. రాళ్ళ దాడి చేయడం మూర్ఖత్వం,తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. నగర సీపీ నానా బూతులు తిట్టి, లాఠీ ఛార్జీ చేశారు. గాల్లో రబ్బరు బుల్లెట్లు కాల్పులు చేశారు. నిజామాబాద్ సీ పీ గతంలో ఎంపీ అవుతానని ప్రకటించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో కొందరు ఐ ఏ ఎస్ లు ప్రవర్తిస్తున్నారన్నారు బండి సంజయ్.
సీపీకి సిగ్గుండాలి, రౌడీలా ప్రవర్తించాడు అధికారులు సంఘాలు ఏం చేస్తున్నాయి? శివాజీ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా? బైంసా లో జరిగినట్లే బోధన్ లో జరిగింది. నీలాంటి వాళ్ళని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు బండి సంజయ్. ప్రభుత్వం శివాజీ జయంతి చేస్తే అడ్డుకుంటుంది. ఎం ఐ ఏం ఏది చెప్తే రాష్ట్రంలో అది అమలు అవుతుంది. సిరిసిల్లలో 25 మంది బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు పెట్టారు. టీ ఆర్ ఎస్ గుండాలు దాడి చేస్తే చర్యలు ఉండవు. పోలీస్ లు టీ ఆర్ ఎస్ ఫ్రెండ్లీ గా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు బండి సంజయ్.
ఏప్రిల్ 14 ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత కి అమిత్ షా ని ఆహ్వానించాము. కేసీఆర్ తప్పు చేసి వివాదాలలో పడ్డాడు. సీఎం కి సిగ్గు ఉండాలి. కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారు. కేంద్రం వడ్లు కొంటాను అని చెప్పింది.. కొనే బాధ్యతలు మేము తీసుకుంటాము. దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు పై పాలసీ ఉంటుంది. నీ ఏడుపు నువ్వు ఏడువు.. పక్క రాష్ట్రాలు గురించి ఎందుకు?
ఇండియా గేట్ దగ్గర, బిజెపీ ఆఫీస్ దగ్గర వడ్లు పోయడానికి జే సి బీ లు దొరకడం లేదా? పార్లమెంట్ లో ధాన్యం కోనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని పీయూష్ గోయల్ క్లారిటీ గా చెప్పారు. యూ పీ ఏ లో కంటే ఎన్ డీ ఏ ప్రభుత్వం లో రెట్టింపు ధాన్యం కొంటున్నాము. దేశం లో వడ్లు కొనుగోళ్లు లో తెలంగాణ రెండో రాష్ట్రంలో ఉందన్నారు బండి సంజయ్. కేంద్రం వడ్లు కొనుగోలు కి 84,120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వానా కాలంలో 40 లక్షలు మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తో అగ్రిమెంట్ జరిగింది.
అదనంగా 24 లక్షలు మెట్రిక్ టన్నుల కొంటానని కేంద్రం చెప్పింది. బాయిల్డ్ రైస్ కి, రా రైస్ కి రైతులు కి ఏమి సంబంధం? ఇప్పటి వరకు అదనంగా ఇస్తామన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ధాన్యం కొనుగోలు లో పెద్ద స్కామ్ జరుగుతుంది. వరంగల్ లో 40 వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుబడింది. కొనుగోలు కేంద్రాలు ఎత్తి వేస్తామని ఎందుకు ప్రకటించారు. కేసీఆర్ ది నోరా.. తాటి మట్టా? తన తప్పులు కేంద్రం పై నెట్టే ప్రయత్నం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
ఢిల్లీ వెళ్లి ఏమి చేస్తావు? నీ ఫాం హౌస్ లో వరి వేస్తావు.. రైతులు మాత్రం వద్దా? కేంద్రం ఫిబ్రవరి లో సమావేశము నిర్వహిస్తే ధాన్యం ఇవ్వమని రాష్ట్ర అధికారులు చెప్పారు. సీఎం డ్రామాలు ఆడుతూ రైతులు ని ఇబ్బందులు పెడుతున్నారు. తన తప్పులు కేంద్రం పై వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ఏమి జరిగిన కేంద్రం అంటాడు. క్యాంటీన్ లో ధర్నాలు చేసి పార్లమెంట్ హౌస్ లో ధర్నా చేశాము అని వాళ్ళ ఎంపీ లు హడావుడి చేశారు.