ఎల్లారెడ్డి బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు, జనం. దారి పొడవునా రేవంత్ రెడ్డికి భారీ స్వాగతాలు లభించాయి. గ్రామాలలో, పట్టణాలలో రోడ్డుకు ఇరువైపులా రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికారు ప్రజలు. భారీ గజ పూల మాలలతో, మంగళ హారతులు, తిలకాలు దిద్దారు. రేవంత్ రెడ్డికి స్వాగతం చెప్పారు. ఎల్లారెడ్డి ఆర్టీసీ గ్రౌండ్ లో మన ఊరు, మన పోరు బహిరంగ సభ జరుగుతోంది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కి మన ఊరు మన ఊరు కార్యక్రమానికి వెళుతున్న ఏపీసీసీ అధ్యక్షులు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి హవేలి గన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం చెప్పారు. హవేలీ ఘన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేశారు టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.