మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మరోసారి కేంద్రం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. కార్వాన్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. కంటోన్మెంట్‌లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోందన్నారు.. ఇక, శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదనన్ ఆయన. ఇలా కంటోన్మెంట్, ఏఎస్ఐ అభివృద్ధికి అడ్డు పడుతోందని మండపడ్డారు.. ఇది మంచి పద్ధతి కాదని, కంటోన్మెంట్ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తామని ప్రకటించారు.. ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్ చేస్తాం.. నాలాల మీద చెక్ డ్యాంలు కడుతామంటే చూస్తూ ఊరుకోబోమని.. అవసరమైతే కంటోన్మెంట్‌కు మంచినీళ్లు, కరెంట్ బంద్ చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.. అయితే, ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ..
Read Also: World’s Longest Car: కారంటే ఇదేరా..! సిమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ ఇంకెన్నో..
రక్షణశాఖ ప్రాంతమైన కంటోన్మెంట్‌లో విద్యుత్, నీటి సరఫరా నిలిపివేస్తామని, మంత్రి కేటీఆర్ సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడుతూ రక్షణ శాఖ అధికారులను హెచ్చరించడం సిగ్గుచేటని, అసలు కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు డీకే అరుణ.. అసలు రక్షణ శాఖ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరా బంద్ చేయడానికి ఈ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా? అని ప్రశ్నించిన ఆమె.. భారత్ చైనా సరిహద్దు ప్రాంతం నుంచి దేశ సైనికులు తోక ముడ్చుకొని వచ్చారని, రక్షణ శాఖపై గతంలో సీఎం కేసీఆర్ హేళన చేయడం, స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కవిత , కాశ్మీర్ భారత దేశంలో భాగం కాదు అని దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం వెనుక అసలు రహస్యం ఏమిటని ప్రశ్నించారు. దేశ సరిహద్దులో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నిలవడం మరిచి, వారిపై అవాకులు చవాకులు మాట్లాడాం కల్వకుంట్ల కుటుంబం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డ డీకే అరుణ. ఇటువంటి దేశ వ్యతిరేకులు దేశం విడిచి వెళ్లిపోతే భరతమాతకు వీరి భారం తగ్గుతుందని వ్యాఖ్యానించారు.