సీఎం కేసీఆర్ నాయకత్వం లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నాం. 2500 మెట్రిక్ టన్నుల నుండి 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు కలెక్ట్ చేస్తున్నారు. 4500 స్వచ్ఛ ఆటోలను చెత్త కలెక్షన్ కోసం వాడుతున్నాం అన్నారు మంత్రి కేటీఆర్. పీపుల్స్ ప్లాజా వద్ద 20 మొబైల్ SCTP వాహనాలను ప్రారంభించారు మంత్రి కేటిఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పాల్గొన్నారు. కొద్ది…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ కల్యాణ్‌ల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే విజయవాడలోని కృష్ణలంకలో ఏర్పాటు చేసిన సీఎం…
సూపర్ హిట్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ అధికారిక రీమేక్ “భీమ్లా నాయక్”. ‘భీమ్లా నాయక్’లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, బ్రహ్మాజీ, రఘుబాబు, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలుపోషిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ట్విటర్‌లోకి వెళ్లి “భీమ్లా నాయక్” టీమ్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “నా సోదరులు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, తమన్, దర్శకుడు సాగర్…
కేసీఆర్ ఇంత కాలం బూతులే మాట్లాడుతారు అనుకున్నా.. ఇప్పుడు జోకులు కూడా బాగానే చెబుతున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హైదరాబాద్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతు బతికినంత వరకు రైతే అన్నారు.. రైతు అంటే నిర్వచనం ఏంటి? అని ప్రశ్నించిన ఆమె.. 66 లక్షల మంది రైతులు ఉంటే 41 లక్షల మంది రైతులకే రైతుభీమా ప్రీమియం ప్రభుత్వం కడుతుందని.. మిగతా 25…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి క్రేజీ కాంబోలో వస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “భీమ్లా నాయక్” గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్నాడు. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్టు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరతానే ప్రచారం ఊపందుకుంది. పార్టీ అధిష్టానం తీరుపై ఆయన అసహనం వెళ్ళగక్కుతున్న సంగతి తెలిసిందే. తనను కోవర్ట్ అంటూ రేవంత్ రెడ్డి అనుచరులే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడవద్దని జగ్గారెడ్డి భావించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా…
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీసీసీ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటంతో వెళ్లి ఆయన పిండాలను మూసీ నదిలో కలిపి వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు పెంపుడు కుక్క, పీసీసీ చీఫ్ రేవంత్…
హైదరాబాద్‌లో ఐటీ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు అంతర్జాతీయ కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు కేవలం మాదాపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రస్తుతం నగర నలుమూలల విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ కంపెనీలను నగరానికి అన్ని దిశల్లో విస్తరించేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే…