Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మొత్తం 16 జడ్పీటీసీ, 103 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అన్ని జిల్లాల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. పార్టీ నాయకులు, అభ్యర్థులు నామినేషన్లు వేయడంలో పోటీ పడుతున్నారు. జడ్పీటీసీ స్థానాల విషయానికి వస్తే, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 7 నామినేషన్లు దాఖలు…
G.O 49: తెలంగాణ ప్రభుత్వం జీవో 49ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లాలో కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇటీవల జీవో 49ను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయం పై స్థానిక ఆదివాసీలలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని జీవోను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. Natti Kumar : ఫిష్ వెంకట్ కు హీరోలు ఎందుకు సాయం చేయాలి.. నిర్మాత కామెంట్స్.. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వారి…
కొమురం భీం జిల్లాలో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టైంది. అదృశ్యమైన యువతి ఆధార్ కార్డు ఏడాది తర్వాత ఇంటికి రావడంతో పోలీసులను ఆశ్రయిస్తే కేసు కూపీలాగారు. ఆ యువతి విషయం వెలుగులోకి రావడంతోనే మరో యువతి ని సైతం విక్రయించినట్లు తేలింది. 9 మంది ఓ ముఠాగా ఏర్పడి యువతులు, ఒంటరి మహిళలే టార్గెట్‌గా అక్రమ రవాణాకు తెరలేపారు. ఆధార్ కార్డు కాస్త క్లూ ఇవ్వడంతో మొత్తం కేసును లాగారు పోలీసులు. ఇద్దరినే అమ్మేశారా?…
Tiger : తెలంగాణలో పులుల రక్షణపై ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నప్పటికీ, పులి వేట ఘటనలు మళ్లీ మానవ క్రూరత్వాన్ని బయటపెడుతున్నాయి. కొమురం భీం జిల్లా పెంచికల్ పేట మండలం ఎల్లూరులో జరిగిన ఓ పులి వేట కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పులిని చంపిన అనంతరం దాన్ని పూడ్చిపెట్టిన వేటగాళ్లు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులకు చిక్కారు. అటవీ శాఖ అధికారుల దర్యాప్తు ప్రకారం, వేటగాళ్లు ముందుగా విద్యుత్ తీగలను అమర్చి పులిని బలిగా…
భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డోకే జయరామ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు ఇక పిల్లకు పుట్టక పోవడంతో మగపిల్లాడి కోసం రెండో వివాహం చేసుకున్నాడు జయరామ్.
Minister Seethakka : ఇంద్రవెల్లి సంఘటన జ్ఞాపకార్థం నిర్వహించిన సభలో ఆదివాసుల హక్కుల కోసం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. “అనాటి ఘటన దురదృష్టకరమైనది. అది ఎవరి వైపు నుంచైనా తప్పుగా జరిగి ఉండొచ్చు, కానీ బాధ్యతను మేమే తీసుకుంటాం” అంటూ ఆమె పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, అప్పట్లో రెవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇంద్రవెల్లి అమరవీరుల జ్ఞాపకార్థం స్మృతివనం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. “అప్పుడు నివాళులర్పించడానికి కూడా అనుమతి ఇవ్వలేదు.…
Sai Kumar : టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ కు ప్రఖ్యాత కొమరం భీమ్ పురస్కారం దక్కింది. సాయి కుమార్ టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. అప్పట్లో పెద్ద హీరోలకు వాయిస్ అందించారు. ఇతర భాషల హీరోలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఎన్నో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాంటి సాయి కుమార్ ను 2024 సంవత్సరానికి గాను కొమరం భీమ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, ఐఏఎస్ పార్థసారథి, కో…
కొమురం భీం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కోడలి పై హత్యాయత్నం చేశారు అత్త, మామల, భర్త. కోడలు గర్భిణీ అని తెలిసి కూడా తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు.