భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డోకే జయరామ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు ఇక పిల్లకు పుట్టక పోవడంతో మగపిల్లాడి కోసం రెండో వివాహం చేసుకున్నాడు జయరామ్.
READ MORE: Pahalgam Terror Attack: నా భర్త రక్తపుమరకలు తుడవొద్దు.. మంజునాథ్ భార్య పల్లవి విజ్ఞప్తి
రెండో భార్య డోకే భానక్క (40)కు సైతం ఇద్దరు అమ్మాయిలే పుట్టడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. నిన్న రాత్రి రెండో భార్య భానక్కతో మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన జయరామ్.. వ్యవసాయానికి ఉపయోగించే పలుగుతో రెండో భార్య తలమిద బాదాడు. తీవ్ర రక్తశ్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
READ MORE: Kalki 2 : ‘కల్కి-2’ విడుదల పై ఇంట్రస్టింగ్ కామెంట్ చేసిన నాగ్‌అశ్విన్