కొమురం భీం జిల్లాలో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టైంది. అదృశ్యమైన యువతి ఆధార్ కార్డు ఏడాది తర్వాత ఇంటికి రావడంతో పోలీసులను ఆశ్రయిస్తే కేసు కూపీలాగారు. ఆ యువతి విషయం వెలుగులోకి రావడంతోనే మరో యువతి ని సైతం విక్రయించినట్లు తేలింది. 9 మంది ఓ ముఠాగా ఏర్పడి యువతులు, ఒంటరి మహిళలే టార్గెట్‌గా అక్రమ రవాణాకు తెరలేపారు. ఆధార్ కార్డు కాస్త క్లూ ఇవ్వడంతో మొత్తం కేసును లాగారు పోలీసులు. ఇద్దరినే అమ్మేశారా? మధ్యప్రదేశ్‌కు ఎంత మందిని ఇలా విక్రయించారు? అదృశ్యమైన కేసుల్లో ఇలాంటి ముఠాలకు చిక్కింది ఎంతమంది? పోలీసుల విచారణలో ఏం తేలింది?
కొమురం బీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని వాడి గొందికి చెందిన ఓ యువతి సంవత్సరం క్రితం అదృశ్యమైంది. యువతి కోసం కుటుంబ సభ్యులు తెలిసిన బంధువుల ఇండ్లలో వెతికారు. ఎలాంటి సమాచారం రాలేదు. అయితే ఏడాది తర్వాత అదృశ్యమైన యువతికి ఆధార్ కార్డు ఇంటికొచ్చింది. ఈ క్రమంలో ఆమె బతికే ఉందని భావించిన కుటుంబ సభ్యులు.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో కూపీలాగిన పోలీసులకు మానవ అక్రమ రవాణా ముఠాకు లింకుందనే విషయం తెలిసింది…
అలా ఆధార్ కార్డు ఇచ్చిన హింట్‌తో విచారణలో దూకుడు పెంచిన పోలీసులకు మరో యువతి విషయం తెలిసింది. ఈ రెండు కేసుల్లో వేర్వేరు FIR లు నమోదు చేసి ఇన్వేస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కొంత మంది మహిళలు, ఓ కానిస్టేబుల్.. మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తులకు ఆ యువతులను విక్రయించిన విషయం బయటపడింది…యువతిని లక్షా ముప్పై వేలకు మధ్యప్రదేశ్‌కు అమ్మేసిన ముఠా
మరో యువతిని లక్షా 10వేలకు అమ్మకం
మొత్తం 9 మంది నిందితుల్లో ఆరుగురు అరెస్ట్ . తనను మోసగించి తక్కువ కులానికి చెందిన దానిగా చూపిస్తూ ఎవరు తన గురించి అడగరని.. లక్షా ముప్పై వేలకు మధ్యప్రదేశ్‌కు అమ్మేశారని బాధిత యువతి పోలీసులకు తెలిపింది. తనను కూడా లక్షా పది వేలకు అదే గ్యాంగ్ మధ్యప్రదేశ్‌కు అమ్మేశారని మరో బాధిత యువతి వెల్లడించింది. ఈ రెండు కేసుల్లో 9 మంది నిందితులున్నట్లు గుర్తించి ఆరుగురుని అరెస్ట్ చేశారు ఆసిఫాబాద్ పోలీసులు…
రారీలో ఉన్న ముగ్గురి కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నామని ఆసిఫాబాద్ డీఎస్పీ రామానుజం తెలిపారు. హరిదాసు అనే కానిస్టేబుల్‌పై 2019లో తిర్యానిలో ఇదే మహిళల అమ్మకం కేసు నమోదైందని వెల్లడించారు. 2022 నుంచి విధులకు గైర్హాజరౌతున్నాడు. ఆ కానిస్టేబుల్‌ను సైతం అరెస్ట్ చేశామన్నారు. ఇంకా ఈ కేసులో రమేష్ గౌడ్, సురేఖ, జగదీష్ మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పరారీలో ఉండగా విజయలక్ష్మి, సుజాత, పంచపూల ఉష, సురేఖ భాగస్వాములు అయ్యారన్నారు…
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, సెక్సువల్ ఇమ్మొరల్ ట్రాఫిక్ యాక్ట్ సెకన్లపై కేసు నమోదు. యువతుల పేదరికం ఆధారంగా ట్రాప్ చేసి ఈ ముఠా సభ్యులు మధ్యప్రదేశ్‌లో జార్వాలో వీరిని అమ్మినట్టు బాధితురాలు పోలీసులకు వాగ్మూలం ఇచ్చిందంన్నారు డీఎస్పీ రామానుజం. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, సెక్సువల్, ఇమ్మొరల్ ట్రాఫిక్ యాక్ట్ సెకన్లపై కేసు నమోదు చేశామన్నారు. ఈ ముఠా బారిన పడి అంగట్లో సరుకులుగా మారిన యువతులు లేదా మహిళలు ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఒంటరి మహిళలు, యువతులు, భర్త చనిపోయిన వారినే టార్గెట్ చేస్తూఈ ముఠా ఆగడాలు సాగిస్తుందని చెప్పారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు… ఈ కేసు మొత్తాన్ని వెలుగులోకి తేవడంలో ఆధార్ కార్డుదే కీలక పాత్ర..అక్కడ మధ్యప్రదేశ్‌లో ఉన్న యువతి ఆధార్ అప్ డేట్ చేయడం ఆకార్డు తన ఇంటి అడ్రస్‌కు రావడం దాన్ని బట్టి కేసులో కీలక అంశాలను రాబట్టగలిగారు పోలీసులు. ముఠా ఆగడాలను వెలుగులోకి తెచ్చారు…