Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మొత్తం 16 జడ్పీటీసీ, 103 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అన్ని జిల్లాల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. పార్టీ నాయకులు, అభ్యర్థులు నామినేషన్లు వేయడంలో పోటీ పడుతున్నారు. జడ్పీటీసీ స్థానాల విషయానికి వస్తే, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 7 నామినేషన్లు దాఖలు అయ్యాయి. స్థానికంగా బలమైన నేతలు పోటీలోకి దిగడంతో జిల్లాలో ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలవడంతో రాష్ట్రంలోనే అత్యధిక నామినేషన్లు ఆ జిల్లాలో నమోదయ్యాయి. రెండవ స్థానంలో కొమరం భీం జిల్లా ఉంది, అక్కడ 9 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో ఎంపీటీసీలకు 8, మహబూబాబాద్ జిల్లాలో 5 నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9పై స్టే విధించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది.
Gonda Girl Record: 8 నిమిషాల్లో 240 పుషప్స్, గంటలో 10 కిలోమీటర్లు.. రికార్డ్స్‌లోకి ఆరేళ్ల చిన్నారి!