తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘మారన్’ మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. సోమవారం ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. దానికి సరిగ్గా కొద్ది గంటల ముందే చిత్ర నిర్మాత టి. జి. త్యాగరాజన్… ధనుష్ అభిమానులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ను అందించారు. ఈ మూవీ టైటిల్ హ్యాష్ ట్యాగ్ కు ట్విట్టర్ లో ధనుష్ లోగోను పెట్టారు. ఈ రకంగా సినిమా పేరుపక్కనే హీరో…
భారతదేశపు సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. ‘కేజీఎఫ్’ తొలి భాగం భాషలకు అతీతంగా ఇండియన్ సినీ అభిమానులను అలరించింది. కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ గా ‘ కేజీఎఫ్ 2’ వస్తోంది. కరోనాతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. ఏది ఏమైనా యశ్ తో పాటు ప్రశాంత్ నీల్ ఆరు సంవత్సరాలు…
నటిగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలో తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది డింపుల్ హయతీ. విజయవాడలో పుట్టి హైదరాబాద్ లో పెరిగిన డింపుల్ కు ఈ యేడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ నెలలో ఆమె సినిమాలు ‘సామాన్యుడు’, ‘ఖిలాడీ’ బ్యాక్ టూ బ్యాక్ విడుదలయ్యాయి. విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ‘సామాన్యుడు’ మూవీ తమిళ, తెలుగు, కన్నడ, మలయళ, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే ఎక్కడా ఈ మూవీకి ఆశించిన స్థాయి సక్సెస్…
ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. కరోనా పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు జూలై 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మాధవన్ తెలిపాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన సైంటిస్ట్ నంబీ నారాయణన్ జీవితంలోని సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ’ చిత్రాన్ని మాధవన్ తెరకెక్కించాడు. సిమ్రాన్ బగ్గా, రజిత్ కపూర్, రవి…
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం నిదానంగా దేశ వ్యాప్తంగా విస్తరించబోతోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో నిరసనకారులను కట్టడి చేస్తుంటే, మరికొన్ని రాష్ట్రాలలో ఆ వివాదాలను అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఇవాళ విడుదలైన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీతో మరో వివాదానికి తెర లేపినట్టు అయ్యింది. ఇందులో హీరో ముస్లిం, అలానే ప్రతినాయకుడు ముస్లిం టెర్రరిస్ట్. దేశంలో అరాచకం సృష్టించడం కోసం టెర్రరిస్టు ప్రయత్నం…
విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ సినిమా ఈ రోజు (ఫిబ్రవరి 11న) విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే కొందరు సినిమాపై వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత భావాలను చిత్ర యూనిట్ ఖండించింది. ”మా ‘ఎఫ్.ఐ.ఆర్.’ ఏ మతస్థులను కించపరిచేట్లు తీయలేదు. ప్రతి భారతీయుడు గర్వపడేలా తీసిన సినిమా ఇది. కానీ, ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా వుందని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాను ఆపేయడం జరిగింది. కానీ సినిమాను చూసిన ప్రముఖులు కానీ, ప్రేక్షకులు కానీ ముస్లిం…
సూర్య నటించిన తాజా సినిమా ‘ఎదరుక్కుమ్ తునిందవన్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వినయ్ రాయ్, సత్యరాజ్, శరణ్య, సూరి ఇతర ముఖ్య పాత్రధారులు. ఇమామ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. సూర్య బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్ లో ‘పసంగ2’ సినిమాను దర్శకత్వం వహించిన పాండిరాజ్ 2019లో సొల్లాచ్చి సెక్యువల్ అసాల్ట్ కేస్…
సమంత నటించిన సినిమా ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతితో, నయనతారతో కలసి సమంత నటించిన తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో టీజర్‌ను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియచేశాడు. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ తో పాటు మూవీ విడుదల తేదీ ప్రకటిస్తూ ‘2.2.2022న 2.22కి రిపోర్టింగ్.…
కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ కి టాలీవుడ్ లోను ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక తాజాగా ‘సామాన్యుడు’ చిత్రంతో మరోసారి హిట్ కొట్టడానికి రెడీ అయిపోయాడు విశాల్. తూ.పా. శరవణన్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘సామాన్యుడు.. నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక…
ఇటీవల ‘డాక్టర్’ సినిమాతో హిట్ ని అందుకున్న శివ కార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న శివ కార్తికేయన్ తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్ ఒకటి సంక్రాంతి పండగనాడు మొదలయ్యింది. శివ కార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నేడు అధికారికంగా ప్రకటించారు. ఇక ఏ సినిమాను విశ్వ నటుడు కమల్ హాసన్, సోనీ…