ప్రయోగాలకు పెట్టింది పేరు హీరో కార్తీ. కథలో కొత్తదనం ఉండాలే కానీ ఎలాంటి పాత్రలోనైనా కార్తీ ఒదిగిపోతాడు. ఇక ఇటీవలే సుల్తాన్ చిత్రంతో మెప్పించిన కార్తీ మరో కథతో రెడీ ఐపోయాడు. ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న చిత్రం ‘విరుమన్`. ఈ చిత్రంలో కార్తీ సరసన డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ కోలీవుడ్ కి పరిచయమవుతుంది. ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య, వదిన జ్యోతిక నిర్మిస్తుండడం విశేషం. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ…
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటి నా పేరు శివ. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు సుసీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇక 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ కు సీక్వెల్ గా మరో కార్తీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో కార్తి –…
నటి ఖుష్బూ భర్త సుందర్ సి. కి తమిళనాట దర్శకుడిగా మంచి పేరుంది. ‘అరుణాచలం’ వంటి వినోదభరిత చిత్రాలతో పాటు, ‘సత్యమే శివం’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కూడా సుందర్ సి తీశాడు. అయితే… గత కొంతకాలంగా సరైన విజయాన్ని సాధించని సుందర్… సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని అనుకుంటున్న ప్రతిసారీ హారర్ జానర్ ను ఆశ్రయిస్తున్నాడు. అలా 2014లో ‘అరణ్మనై’ పేరుతో ఓ సినిమా తీశాడు. అది ‘చంద్రకళ’గా తెలుగులో డబ్ అయ్యింది. ఆ…
అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఎన్నో రోజులుగా ‘వాలిమై’ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక తాజాగా ఆ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హెచ్ వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయ్యి నెట్టింట రికార్డులు సృష్టించాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. హాలీవుడ్ యాక్షన్…
భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఎన్నో గొప్ప చిత్రాలు తీశారాయన. అందులో తమిళ సినిమా ‘దిక్కట్ర పార్వతి’ ఒకటి. రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. 1974లో విడుదలైంది. దీనికి ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్పాన్సర్ చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓ అరుదైన ఘనత పొందింది. చెన్నైలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జనవరి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమాను ప్రత్యేకంగా…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ‘పుష్ప’ ఐటెం సాంగ్ గురించే చర్చ. సమంత నర్తించిన ఏ పాటలో మగవారి మనోభావాలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది వాటినేమి పట్టించుకోకుండా మ్యూజిక్ ని , సమంత అందచందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సాంగ్ ని వేరే సినిమా నుచి కాపీ కొట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సూర్య నటించిన ‘వీడోక్కడే’ చిత్రంలోని ఐటెం సాంగ్…