Toxic : యష్ 'కేజీఎఫ్' సిరీస్ కంటే ముందు ఆయన ఎవరో పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరిసీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. శృతిహాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలోని యక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ ఎంతగానో అలరించాయి. కెజిఎఫ్ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిచింది. రవి బస్రుర్ సంగీతం అందించారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రూ. 800 కోట్లకు…
Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది .. అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే .. ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అటు సంతోషంగా.. ఇటు బాధలో మిక్స్డ్ భావోద్వేగాలతో ఉన్నారు. ప్రభాస్.. ఆదిపురుష్ తో తెరపై కనిపించినందుకు సంతోష పడాలా.. సినిమా ప్లాప్ అయ్యినందుకు బాధపడాలా అని తెలియని పరిస్థితిలో ఉన్నారు.
Kantara Movie: చిన్న చిత్రంగా వచ్చి నిర్మాతల పాలిట వరంలా మారిన కాంతార బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోనే ఉంది. హడావుడి లేకుండా విడుదలైన సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టుతోంది.
Kantara Record: కన్నడ మూవీ కాంతార రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో విడుదలైన సినిమాలలో అభిమానుల అభిప్రాయం ప్రకారం మోస్ట్ పాపులర్ మూవీస్ లిస్ట్ ను విడుదల చేసింది ‘ఐఎమ్ డిబి’ (ద ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) సంస్థ. అయితే ఈ సంస్థ 7 లేదా ఆపై రేటింగ్ ఉన్న సినిమాలనే ప్రామాణికంగా తీసుకుని ఈ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో హైదరాబాదీ అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రథమ స్థానాన్ని, ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్2’…
ప్రభాస్ కి బాహుబలి తరువాత ఆ స్థాయి హిట్ దక్కలేదు. తాజాగా వచ్చిన రాధే శ్యామ్ కూడా నిరాశపరచడంతో అటు డార్లింగ్ ప్రభాస్ తో పాటు అతని అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ పడ్డారు. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టేలా ‘సలార్’ ని సిద్ధం చేసుకుంటున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. అయితే సలార్ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెయిట్ పెరగడంతో దర్శకుడు…
ఒకప్పుడు ఉత్తరాన ఉరిమితే, దక్షిణాన తడుస్తుంది అనే సామెత హిందీ చిత్రసీమలో భలేగా హల్ చల్ చేసింది. ఎందుకంటే అప్పట్లో హిందీలో విజయవంతమైన చిత్రాలను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసి విజయాలు సాధించేవారు. పైగా హిందీ సినిమాయే భారతీయ సినిమా అనే కలర్ తీసుకు వచ్చి, దానినే అంతర్జాతీయంగా పరిచయం చేస్తూ పోయారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రాంతీయ చిత్రాలు సైతం అంతర్జాతీయ మార్కెట్ లో తమ సత్తా చాటుకుంటున్న రోజులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ,…
‘కెజిఎఫ్2’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. తొలి ఆట నుంచే పాజిటీవ్ టాక్ తో పలు చోట్లు పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా దక్షిణ కొరియాలోనూ సందడి చేస్తోంది. అక్కడ ప్రదర్శితం అవుతున్న తొలి కన్నడ చిత్రం ఇదే కావడం విశేషం. పరిమితమైన షోలు, తక్కువ మంది భాషాభిమానులు ఉన్నప్పటికీ కొరియాలో భారీ వసూళ్ళను సాధిస్తుండటం గమనార్హం. రాకీ భాయ్ కథ కొరియన్ ప్రేక్షకులను ఆకట్టుకుని అద్భుతమైన రెస్పాన్స్…