Toxic : యష్ ‘కేజీఎఫ్’ సిరీస్ కంటే ముందు ఆయన ఎవరో పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరిసీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తుంది. మలయాళంలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న గీతూ మోహన్ దాస్ ఈ ‘టాక్సిక్’ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో తన ఇమేజ్ ని పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రాబోతోంది. ఈ విషయాన్ని రాకింగ్ స్టార్ యష్ ప్రకటించారు. జనవరి 8న 10 గంటల 25 నిమిషాలకి సినిమా నుంచి అప్డేట్ రాబోతోందని పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.
Read Also:Kadiyam Srihari: దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే
ఈ పోస్టర్ లో పాతకాలం నాటి కారు ముందు హీరో యష్ క్యాప్ పెట్టుకుని స్టైలిష్ గా సిగార్ కాల్చుతూ నిల్చున్నాడు. ఈ లుక్ చూస్తుంటే ‘కేజీఎఫ్’ తరహాలోనే ఇందులో కూడా రాకింగ్ స్టార్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు అర్థం అవుతుంది. రాకింగ్ స్టార్ అభిమానులు ఈ అప్డేట్ ఏంటా అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఉన్నారు. టీజర్ రిలీజ్ అవుతుందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే ఫస్ట్ గ్లింప్స్ అయి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత యష్ కొత్త సినిమాకి సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో యష్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఆమెకిదే మొదటి కన్నడ సినిమా.. ఇక హ్యూమా ఖురేషి ఈ చిత్రంలో యష్ అక్కగా నటిస్తున్నారట. సిస్టర్ సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ గా ఉండబోతోందని సమాచారం. ‘కేజీఎఫ్ 2’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యష్ చేస్తోన్న మూవీ కావడం ఈ ‘టాక్సిక్’ అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
Read Also:Telangana Voters: ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల కమిషన్.. పంచాయితీ ఎన్నికల కోసమేనా?