Kantara Movie: చిన్న చిత్రంగా వచ్చి నిర్మాతల పాలిట వరంలా మారిన కాంతార బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోనే ఉంది. హడావుడి లేకుండా విడుదలైన సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టుతోంది. తొలుత కన్నడలో ‘కాంతారా’ సెప్టెంబర్ 30న విడుదలైంది. రిలీజై తర్వాత ప్రింట్ల సంఖ్యను పెంచుకుని తమిళం, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో దూసుకుపోతోంది. విడుదలై 50రోజులు దాటినా థియేటర్లలో కాంతార ప్రభంజనం తగ్గట్లేదు. తాజాగా కాంతార సినిమా కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ చేసింది.
Read Also: Hansika Motwani : పెళ్లి కూతురిలా ముస్తాబైన దేశముదురు భామ.. ఎంత అందంగా ఉందో..
ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కన్నడలో కాంతార సినిమా రూ.168.50 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలో రిలీజై అక్కడ రూ.60 కోట్లు రాబట్టింది. తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో రూ.19.20 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్‌కి రూ. 96 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఫారెన్ బాక్సాఫీస్ వద్ద రూ.44.50 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, మానసి సుధీర్ కీలకపాత్రలను పోషించారు. కాంతార సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గురించి త్వరలో వెల్లడిస్తానని రిషబ్ శెట్టి ప్రకటించారు.
‘KANTARA’ CROSSES ₹ 400 CR WORLDWIDE… #Kantara territory-wise breakup… Note: GROSS BOC…
⭐️ #Karnataka: ₹ 168.50 cr
⭐️ #Andhra / #Telangana: ₹ 60 cr
⭐️ #TamilNadu: ₹ 12.70 cr
⭐️ #Kerala: ₹ 19.20 cr
⭐️ #Overseas: ₹ 44.50 cr
⭐️ #NorthIndia: ₹ 96 cr
⭐️ Total: ₹ 400.90 cr pic.twitter.com/CmBQbLrZvf— taran adarsh (@taran_adarsh) November 22, 2022