రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. శృతిహాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలోని యక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ ఎంతగానో అలరించాయి. కెజిఎఫ్ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిచింది. రవి బస్రుర్ సంగీతం అందించారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
Also Read : UiTheMovie : విజయవాడలో సందడి చేసిన ఉపేంద్ర
కాగా ఈ సినిమా విడుదల అయి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సలార్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ సలార్ సక్సెస్ ను నేను చాలా ఎక్కువగా ఊహించాను. కానీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ఈ ఈసినిమాకు థియేటర్లలో వచ్చిన రిజల్ట్ పట్ల నేను పూర్తిగా సంతోషంగా లేను. కెజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు బహుశా నేను వాటిని అనుదుకోలేక పోయానేమో. కానీ సలార్ పార్ట్ – 2 మాత్రం గురి తప్పదు. ఈ సీక్వెల్ కోసం కథ పక్కా గా రెడీ చేశాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలాలో సలార్ -2 నా బెస్ట్ వర్క్ సినిమా అని కూడా చెప్పగలను. ఆ విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నాను’ అని అన్నారు.