Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది .. అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే .. ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అటు సంతోషంగా.. ఇటు బాధలో మిక్స్డ్ భావోద్వేగాలతో ఉన్నారు. ప్రభాస్.. ఆదిపురుష్ తో తెరపై కనిపించినందుకు సంతోష పడాలా.. సినిమా ప్లాప్ అయ్యినందుకు బాధపడాలా అని తెలియని పరిస్థితిలో ఉన్నారు. సరే.. ఏది ఏమైనా ప్రభాస్ కనిపించాడు అది చాలు.. అని సంతోషపడుతున్నారు. ఇక ఆదిపురుష్ రిజల్ట్ తో నీరసించిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ రూపంలో మరో ఆశ చిగురించింది. కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. అన్ని ఆశలు ఈ సినిమా పైనే పెట్టుకున్నారు అభిమానులు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్స్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులు హైప్ పెంచేసుకుంటున్నారు. జూలై 6 న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ టైమింగ్ ను కెజిఎఫ్ 2 తో లింక్ చేసి అభిమానులు ప్రశాంత్ నీల్ యూనివర్స్ అంటూ నెట్టింట చర్చ మొదలుపెట్టారు.
Daksha Nagarkar: ట్యాలెంట్ చూపిస్తున్నా.. పిల్లను పట్టించుకోరేంటయ్యా
ఎప్పటినుంచో ఈ సినిమాకు, కెజిఎఫ్ 2 కు లింక్ ఉందని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. రాఖీ బాయ్, సలార్ ఫ్రెండ్స్ అని, రాఖీ భాయ్ చనిపోయేముందు.. మాఫియాను అంతం చేయమని సలార్ దగ్గర మాట తీసుకున్నాడని.. ఆ మాట కోసమే ప్రభాస్ .. సలార్ గా మారతాడని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ టీజర్ టైమ్.. కెజిఎఫ్ 2 లో రాఖీ బాయ్ చనిపోయే టైమ్ ఒక్కటే అన్నట్లు స్క్రీన్ షాట్స్ తీసి మరీ రచ్చ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ రాలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈవ్ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్టర్లు, అనాలసిస్ లు చూసి ప్రభాస్ ఫ్యాన్స్.. చంపేస్తే చంపేయండయ్యా.. లేదంటే.. ఈ హైప్ తోనే పోయేలా ఉన్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. బాక్సాఫీస్.. ఊపిరి పీల్చుకో అని చెప్పుకోవాల్సిందే.