‘కెజిఎఫ్2’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. తొలి ఆట నుంచే పాజిటీవ్ టాక్ తో పలు చోట్లు పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా దక్షిణ కొరియాలోనూ సందడి చేస్తోంది. అక్కడ ప్రదర్శితం అవుతున్న తొలి కన్నడ చిత్రం ఇదే కావడం విశేషం. పరిమితమైన షోలు, తక్కువ మంది భాషాభిమానులు ఉన్నప్పటికీ కొరియాలో భారీ వసూళ్ళను సాధిస్తుండటం గమనార్హం. రాకీ భాయ్ కథ కొరియన్ ప్రేక్షకులను ఆకట్టుకుని అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇండియన్ మూవీస్ లో వసూళ్ళ పరంగా మూడో స్థానంలో నిలిచిన ఈ సినిమా బాలీవుడ్ లో 400 కోట్ల మార్క్ దాటి ‘బాహుబలి2’ తర్వాత స్థానంలో నిలిచింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.