China Virus: అందరు భయపడుతున్నట్లే జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) సోకింది అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ధ్రువీకరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు బెంగళూరులో పర్యటిస్తోంది. కర్నాటక మంత్రులు, అధికారులతో ఈ పధకం అమలు జరుగుతున్న తీరును సబ్ కమిటీ తెలుసుకుంటోంది. బెంగళూరులో ప్రధాన డిపోలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణిలు కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం సిద్దరామయ్యను ఏపీ మంత్రుల బృందం కలవనుంది. ఏపీలో మహిళల ఉచిత…
నేటి తరం పిల్లల తీరుపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుతున్నా.. భవిష్యత్ గురించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.
Congress: బీజేపీపై మరింతగా దాడి చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిందని, రాజ్యాంగాన్ని అణగదొక్కారని ఆరోపిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది.
ఎన్నికల విధానం, ప్రక్రియ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం నెమ్మదిగా సన్నగిల్లుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి.
Congress: కాంగ్రెస్ మరో వివాదంలో ఇరుక్కుంది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో జార్జ్ సోరోస్తో సంబంధాలు, రాహుల్ గాంధీ ఎంపీలను తోసివేయడం వంటి అంశాలపై బీజేపీ ఆ పార్టీని కార్నర్ చేసింది. తాజాగా కాంగ్రెస్ ‘‘భారతదేశ మ్యాపు’’ని వక్రీకరించడం వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లేకుండా భారతదేశ మ్యాపుని పోస్టర్లుగా వేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోనియా చికిత్స పొందుతున్నారు. తల్లి సోనియా వెంట ప్రియాంకాగాంధీ ఉన్నారు.
CWC meeting: కర్ణాటకలోని బెలగావిలో నేడు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు.
కర్ణాటకలో రహదారుల పేర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. మైసూరులోని ఒక రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఇందుకు ప్రజల నుంచి 30 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.