HYD Police: అఫ్జల్గంజ్ కాల్పులు జరిపిన దుండగులు హైదరాబాద్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ ముఠా ఇంకా రాష్ట్రం దాటలేదన్నారు. పూటకో డ్రెస్ తో హైదరాబాద్ గల్లీల్లోనే తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఆటోల్లో ప్రయాణిస్తూ.. పోలిసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.. హైదరాబాద్ లోని ప్రతి ఏరియా తెలిసి ఉండటం వల్లే.. అంత ఈజీగా తిరుగుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దుండగులకు ఎవరో ఒకరు హైదరాబాద్ కి చెందిన వాళ్ళే షెల్టర్ ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: BJP: బీజేపీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు.. తేదీ ఖరారు!.. రేసులో ఎవరున్నారంటే?
అయితే, హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో దుండగులు తిరుగుతుండగా సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే, నిందితుల కోసం బీహార్, ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్ లకు పంపిన ఎనిమిది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. కాగా, కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలో డబ్బులు తరలిస్తున్న వాహనంపై కాల్పులు జరిపి రూ. 93 లక్షలు దోచుకుని హైదరాబాద్‌కు చేరుకోగా.. ఈ క్రమంలో అఫ్జల్ గంజ్ దగ్గర దొంగలకు బీదర్ పోలీసులు కనిపించడంతో వారి నుంచి తప్పించుకోవడానికి ఓ ట్రావెల్స్ ఆఫీసులోకి ప్రవేశించి.. పోలీసులపైకి కాల్పులు జరుపుతుండగా.. అక్కడ ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌కు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అలర్టైన పోలీసులు దొంగల ముఠాను పట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు.