Karnataka : కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి పట్ల కన్న తండ్రే కసాయి వాడయ్యాడు. ముక్కు పచ్చలారని పసి కందును తీసుకెళ్లి బలవంతంగా ముసలోడికి కట్టబెడ్డాడు. చిక్కబళ్లాపూర్ జిల్లా శిడ్లఘట్ట తాలూకాలోని గోరామడుగు గ్రామంలో 15 సంవత్సరాల బాలికను 45 ఏళ్ల మంజునాథ్ అనే వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. ఈ వివాహం అమ్మాయి తల్లి రుక్మిణి అనుమతి లేకుండా జరిగింది. బాలిక తండ్రి నారాయణస్వామి తన భార్య, కుమార్తెను బెదిరించి వివాహం చేశారు.Baba Ramdev: బాబా రామ్‌దేవ్, బాలకృష్ణకు కేరళ కోర్టు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
ఈ విషాదకరమైన సంఘటన బాలిక భద్రతపై తీవ్రమైన ఆందోళనను కలిగించింది. వివాహం జరగడంతో ఆమె తల్లి రుక్మిణి, బాలిక వివాహానికి వ్యతిరేకత తెలపడంతో నారాయణస్వామి వారిపై దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై చిక్కబళ్లాపూర్ పోలీసులు తక్షణమే చర్య తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన బాల్య వివాహాలను అరికట్టాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చేలా చేసింది.
Read Also:Bharat Mobility Expo: ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో హ్యుందాయ్ క్రెటా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018లో ప్రారంభించిన ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం (Aspirational Districts Program(ADP)) కింద, 15,000 గ్రామాలను బాల్య వివాహాల నుంచి విముక్తం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ పిల్లలను రక్షించడం, విద్య అందించడం, సాధికారత కల్పించడం కోసం చేపట్టిన ప్రణాళికల్లో భాగంగా, బాల్య వివాహాలను అరికట్టే ప్రయత్నం జరుగుతోంది. పోలీసులు ఈ కేసును పటిష్టంగా దర్యాప్తు చేస్తూ, నిందితులపై చర్యలు తీసుకుంటారని తెలిపారు.