Road Accident: రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థుల మృతి!
- కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
- వేదపాఠశాల విద్యార్థుల వాహనం బోల్తా
- ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం కర్ణాటకలోని సింధునూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు.
మంగళవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు (14 మంది) కర్ణాటకలోని హంపి క్షేత్రానికి సమీపంలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో పూజలకు బయల్దేరారు. సిందనూరు వద్ద చక్రాల బోల్టులు ఊడిపోవడంతో కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర.. డ్రైవర్ శివ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు మంత్రి సూచించారు. కర్నాటక ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసుల మృతి చెందడంతో.. అధికారులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!