కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోనియా చికిత్స పొందుతున్నారు. తల్లి సోనియా వెంట ప్రియాంకాగాంధీ ఉన్నారు.
CWC meeting: కర్ణాటకలోని బెలగావిలో నేడు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు.
కర్ణాటకలో రహదారుల పేర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. మైసూరులోని ఒక రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఇందుకు ప్రజల నుంచి 30 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.
Kurkure Packet: కేవలం 20 రూపాయల కుర్కురే ప్యాకెట్ కోసం రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ దాడుల్లో 10 మందికి పైగా గాయపడగా, పలువురు పరారీలో ఉన్నారు.
కర్నాటకలోని ఉడిపిలో టైరు పగిలి మెకానిక్ గాల్లోకి ఎగిరిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఉన్న టైర్ షాప్ మెకానిక్ స్కూల్ బస్సు టైర్ని పంచర్ వేసి గాలి నింపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే టైరు పేలింది. దీంతో.. అక్కడే ఉన్న మెకానిక్ గాల్లో ఎగిరిపడ్డాడు. ఈ క్రమంలో మెకానిక్ అబ్దుల్ రజీద్ (19)కు గాయాలయ్యాయి.
భార్య మార్పిడి, గర్ల్ఫ్రెండ్స్ను ఇచ్చిపుచ్చుకోవడం వంటి డర్టీ గేమ్లు కర్ణాటకలో బట్టబయలయ్యాయి. హరీష్, హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అరెస్ట్ చేసింది. వీరిద్దరూ ప్రైవేట్ పార్టీ పేరుతో ఈ జుగుప్సాకరమైన గేమ్ను నడుపుతున్నారు. వీరు మహిళలను బలవంతంగా, బ్లాక్ మెయిల్ చేస్తూ దోపిడీ చేశారని తేలింది. ఓ మహిళ సీసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. బలవంతంగా శృంగారం చేసేలా ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. నిందితులు, వారికి…
Divorce Case: బిడ్డకు పేరు పెట్టే విషయంపై భార్యభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు విడాకులు వరకు వెళ్లింది. తమ బిడ్డకు పేరు పెట్టడంలో ఏర్పడిన ప్రతిష్టంభనపై దంపతులు విడాకులు కోరిన ఘటన కర్ణాటకలో జరిగింది. 26 ఏళ్ల వ్యక్తి 2021లో జన్మించిన తన కుమారుడి పేరు పెట్టే కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో వివాదం మొదలైంది.
చాలా మంది ప్రైవేట్ ఉద్యోగానికి బదులు ప్రభుత్వ ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కర్ణాటకలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిళ్లపై ఓ తహసీల్దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మిగిలేది లేదని, పానీపూరీ అమ్మే వాడు మనకంటే గొప్పవాడని తహసీల్దార్ చెప్పారు. పానీ పూరీ అమ్మేవాడి సంపాదన కూడా తమ కంటే…