Hyderabad: అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితుల గుర్తింపు
- అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితులను గుర్తించిన పోలీసులు.
- ఏటీఎం సిబ్బందిపై కాల్పులకు పాల్పడిన ఘటనలో నిందితులు.
- ప్రధాన నిందితులలో ఒకరు బిహార్‌కి చెందిన మనీష్‌గా గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: కర్ణాటకలోని బీదర్ నగరంలోని శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బైక్ పై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇక దాడి చేసిన వ్యక్తులు ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని.. ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆ దోపిడీ దొంగలు హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో ఉన్నట్టు తెలుసుకున్న బీదర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చారు.
Also Read: Hyderabad: షార్ట్ సర్క్యూట్ దెబ్బకి ఇద్దరు మృతి
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ నేపథ్యంలో అప్జల్‌గంజ్ ప్రాంతంలో పోలీసులను చూసిన దొంగల ముఠా.. అక్కడినుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరిపారు. ఆపై రోషన్ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు ట్రావెల్స్ మేనేజర్ పైన కాల్పులు జరిపి, అఫ్జల్‌గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వచ్చారు. అయితే అక్కడి నుంచి ఎటు వెళ్లారన్న విషయాన్ని పోలీసులు గాలిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సంఘటనకు సంబంధించి నిందితులను గుర్తించినట్లుగా సమాచారం అందింది.
Also Read: Transport Deportment: ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝళిపించిన రవాణా శాఖ
ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులలో ఒకరు బిహార్‌కి చెందిన మనీష్‌గా గుర్తించబడ్డాడు. మనీష్‌తో కలిసి ఇతర వ్యక్తులు కూడా దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నిందితులు వారం క్రితం నుండి వివిధ ప్రాంతాల్లో దోపిడీలను నిర్వహించినట్లు సమాచారం. వీటిలో కొన్ని ఛత్తీస్‌గఢ్, బీదర్ ప్రాంతాలలోనూ దోపిడీలు జరిగాయి. గతంలో కూడా మనీష్‌పై హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. అతనిపై బిహార్ ప్రభుత్వం రివార్డు కూడా ప్రకటించింది. ప్రస్తుతం, మనీష్‌పై వేటకు కృషి చేస్తున్న పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ, బిహార్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మనీష్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!