కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు డీకే.శివకుమార్ చాలా కృషి చేశారు. రాష్ట్రమంతా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా కాంగ్రెస్ విజయం సాధించాక సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని తన్నుకుపోయారు. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే.శివకుమార్‌కు అడియాసలే మిగిలాయి.
దక్షిణ భారత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో ఘోర విషాదాన్ని నింపాయి. గంటల వ్యవధిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడు ముప్పు వస్తుందో ఎవరు చెప్పలేరని అనడానికి ఈ ప్రమాదాలే ఉదాహరణలు. గమ్యానికి చేరుకునేలోపే మృత్యువు రోడ్డుప్రమాదాల రూపంలో రావడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
క్రిస్మస్ పండగ వేళ కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగినట్టుగానే కర్ణాటకలో కూడా పెను విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కర్ణాటకలో అధికార మార్పిడి రాజకీయాలు సద్దుమణగలేదు. గత కొద్ది రోజులు పవర్ షేరింగ్‌పై వివాదం నడుస్తోంది. హస్తిన వేదికగా సాగిన రాజకీయాలు.. అనంతరం బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలుగా మారిపోయింది.
Karnataka: కర్ణాటకలో మరోసారి ‘‘టిప్పు జయంతి’’ ఉత్సవాలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశపనవ్వర్ అసెంబ్లీలో పిలుపునిచ్చారు.
Karnataka: కర్ణాటకలోని చిక్కమగళూర్‌లో జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త మరణించడం, ఆ రాష్ట్రంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జిల్లాలోని రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో కాంగ్రెస్ కార్యకర్త, గ్రామ పంచాయతీ సభ్యుడు మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
Techie Suicide: నగర పాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించాడు. కొత్త ఇంటి నిర్మాణానికి పదే పదే ఆటంకాలు కలిగించడం, డబ్బులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం ఆరోపిస్తోంది.
కర్ణాటకలో ‘పవర్ షేరింగ్’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ట్విస్టులు.. మీద ట్విస్టులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ‘బ్రేక్‌ఫాస్ట్’ పాలిటిక్స్ సాగుతున్నాయి. అయితే ఈ అల్పాహారం రాజకీయాల వెనుక చాలా కథనే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Rameshwaram Cafe: బెంగళూర్‌లోని ప్రముఖ రెస్టారెంట్ అయిన రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు నమోదైంది. నిఖిల్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కల్తీ ఆహారం, తప్పుడు బెదిరింపులు కేసు పెట్టినందుకు దాని యజమానులు రాఘవేంద్ర రావు, దివ్య రాఘవేంద్ర రావులతో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుమంత్ లక్ష్మీ నారాయణలపై కేసు నమోదైంది.