Muda Scam: కర్ణాటకలో ముడా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతరులకు చెందిన 300 కోట్ల రూపాయల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
Read Also: Top Headlines @1PM : టాప్ న్యూస్!
ఈ అటాచ్ చేసిన ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పని చేస్తున్న పలువురు వ్యక్తుల పేరిట రిజిస్టర్ అయినట్లు విచారణ సంస్థ వెల్లడించింది. కాగా, ముడా భూ కుంభకోణంలో సిద్ధరామయ్య భార్యకి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ పేర్కొనింది. సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతి నుంచి ముడా 3 ఎకరాల 16 గుంటల ల్యాండ్ ను తీసుకుని ఆ తర్వాత ఖరీదైన ఏరియాలో 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని ఈడీ వెల్లడించింది. కానీ, వీటి విలువ రూ.56 కోట్ల వరకు ఉంటుందని చెప్పింది.