Karnataka: ప్రేమించి, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి 12 ఏళ్ల పాటు కాపురం చేసిన ఓ జంట. అయితే, ఆ వివాహిత మరొకరి మీద మోజుపడి కట్టుకున్నోడికి తీరని అన్యాయం చేసింది. అంతే, భర్త గుండె పగిలి ప్రాణాలు తీసుకున్నాడు. తన స్నేహితుడే భార్యను లేపుకెళ్లాడంతో జీవితంపై విరక్తి చెందిన ఆ భర్త సెల్ఫీ వీడియో తీసుకుని.. తన చావుకు పరారైన భార్య, స్నేహితుడే కారణమని వెల్లడించాడు.
Karnataka : డబ్బు, మహిళ, భూమి అనే మూడింటి కోసం ప్రతి మనిషి ఏదైనా చేస్తాడని అంటుంటారు. అది కూడా నిజమే. కర్ణాటక నుండి ఈ మూడు విషయాలకు సంబంధిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని మైసూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
జయలలిత ఆస్తులు చెన్నై చేరుకున్నాయి. మాజీ సీఎం జయలలిత ఆస్తులను స్పెషల్ సీబీఐ కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించింది. నిన్నటి 12 అట్టపెట్టెల్లో భారీ భద్రత నడుమ బెంగుళూరు నుంచి చెన్నై తరలించారు. మొత్తం నాలుగు వేల కోట్లు విలువ చేసే 27 కిలోల ఆభరణాలు.. 601 కిలోల వెండి ఉన్నట్లు అధికారులు తెలిపారు. పది వేలకుపైగా చీరలు, 750 జతల చెప్పుల జతల చెప్పులు ఉన్నాయి.
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ముడా భూ కేటాయింపు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్య పార్వతి బీఎంకు ముడా ద్వారా 14 ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ముడా భూమి స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు కోరుతూ ఓ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు స్వతంత్రంగా ఉందని పేర్కొంది. ముడా ఇళ్ల స్థలాల కేసును సీబీఐకి అప్పగించాలని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది.…
కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు బిస్కెట్లు పంపిణీ చేశాడు. ఇందులో వింత ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఈ బిస్కెట్లు పంపిణీకి కారణమే పెద్ద వింత.. ఆ ఆటో డ్రైవర్ తన భార్య పుట్టింటికి వెళ్లడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషంలో అతను తన ఆటోలో ప్రయాణించిన వాళ్లకు బిస్కెట్లు పంపిణీ చేశాడు.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూర్లో జరిగింది. పట్టపగలే ఈ దారుణం జరిగింది, నేరం చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. మరణించిన విద్యార్థిని షిఫా(24)గా గుర్తించారు. నిందితుడు టైల్స్ దుకాణంలో పనిచేసే ముబిన్గా గుర్తించారు.
క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఏవైనా పతకాలు సాధించినప్పుడు ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహం మరింత ఉత్తేజపరుస్తాయి. ఇలా ఆయా రకాలైన ఆటల్లో చూస్తుంటాం.