PM Modi: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వరసగా రెండో రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రోజు శనివారం మూడు గంటల పాటు మోదీ రోడ్ షో జరిగింది. దాదాపుగా 13 నియోజకవర్గాలను కవర్ చేస్తూ శనివారం నగరంలో దాదాపు 26 కి.మీ రోడ్‌షో నిర్వహించిన ప్రధానిని చూసేందుకు భారీగా ప్రజలు రోడ్డుకిరువైపుల…
Asaduddin Owaisi: కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు, రేపు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మాజీ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ తరుపు నుంచి హుబ్బళి నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఆయన కోసం సోనియా గాంధీ శనివారం ప్రచారం చేశారు.
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్‌లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్‌లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
కర్ణాటకలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 140 సీట్లకు పైగా గెలుస్తుందని కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ శనివారం విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.
PM Modi: కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకోబోతోంది. ఎన్నికలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. ప్రచారానికి మరో రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని నరేంద్రమోడీ మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
The Kerala Story: వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది ‘ది కేరళ స్టోరీ’ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సినిమా విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని పలువురు సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ..కోర్టులు అందుకు నిరాకరించాయి. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద భద్రతను కల్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించింది.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే, అతని కుటుంబాన్ని చంపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందని ఆరోపించింది. చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ హిస్టరీ షీటర్ అయిన మణికంఠ రాథోడ్ ను రంగంలోకి దింపిందని బీజేపీని కాంగ్రెస్ నిందించింది. మనికంఠ అనుచిత పదజాతంలో ఖర్గేను దూషించాడని ఆరోపిస్తూ.. అందుకు…