Asaduddin Owaisi: కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు, రేపు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మాజీ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ తరుపు నుంచి హుబ్బళి నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఆయన కోసం సోనియా గాంధీ శనివారం ప్రచారం చేశారు.
Read Also: Wife Extramarital Affair: భార్య ఘాతుకం.. ప్రియుడితో కలిసి దారుణం
అయితే దీనిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన జగదీష్ షట్టర్ కు సోనియాగాంధీ ప్రచారం చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తూ.. ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి సోనియాగాంధీ ప్రచారం చేస్తారని తాను ఊహించలేదని ఆయన అన్నారు. ఇదేనా సెక్యులరిజం..? మోడీని ఇలాగే ఎదుర్కొవాలా.? అంటూ ప్రశ్నించారు. సైద్ధాంతిక పోరులో కాంగ్రెస్ విఫలం అవడం సిగ్గు చేటు అని ఓవైసీ విమర్శించారు. ఇలాంటి వారు తాను బీజేపీ-బీ టీమ్ అంటూ నిందిస్తారని ఎద్దేవా చేశారు.
బీజేపీ పార్టీ కీలక నేతగా ఉన్న జగదీష్ షెట్టర్ కు ఈ సారి పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం హుబ్బలి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో నిలబడ్డారు. ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నప్పటికీ.. షెట్టర్ లౌకిక వ్యక్తి అంటూ కాంగ్రెస్ ప్రశంసలు కురిపించింది. ఆయనకు మద్దతుగా సోనియాగాంధీ మూడేళ్ల తరువాత తొలిసారిగా ప్రచారం చేశారు. ము 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.